మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా..రోజువారీ పనులు తప్పవు. పైగా ఆరోగ్య నిపుణులు సైతం మహిళలు ఒత్తిడికి గురవ్వుతున్నారంటూ ఆందోళనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా..మహిళలకు ఈ పనుల్లో ఎలాంటి వెసులబాటు ఉండదు. అందులోనూ పిల్లల తల్లులు ఉద్యోగాలు చేస్తే..మరింత భారం పడుతుంది. ఇది అందరికీ తెలిసింది. దీని గురించి ఇప్పుడు సాక్షాత్తు ఓ దేశ మహిళా ప్రధాని ఏకరవుపెట్టడంతో నెట్టింట వైరల్గా మారింది.
ఆ మాటలు అన్నది ఎవరో కాదు జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయ్ తకైచి అన్నారు. పీఎం ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. అందులోనూ తాను మహిళా ప్రధాని అని అందువల్ల ఇంటి పనులు కూడా చక్కబెట్టుకుని ఆఫీస్ పనులు చూసేటప్పటకీ కంటి మీద కునుకు కూడా కరువైందని వాపోయిందామె. పురుష ప్రధానిలా ఇలా రెడీ అయిపోయి..అలా చకచక వచ్చేయడం ఆడవాళ్లకు కుదురని పని అని అంటోందామె.
అందుకు కారణం కూడా చెప్పారామె. ఆడవాళ్లు ఇంటిపనులు, వంట, అన్ని చేయడమే గాక మేకప్ కూడా వేసుకుని వచ్చేటప్పటికీ కొంత సమయం గడిచిపోతుంది. దాంతో మూడు లేదా నాలుగు గంటలు అదనంగా వెచ్చించి మరి పనిచేయాల్సి వస్తుందని చెబుతోందామె. ఆ కారణంగానే పురుష ప్రధానమంత్రుల కంటే ఎక్కువ పనిచేయక తప్పడం లేదని అంటోంది సనాయ్. తనను తాను పని బానిసగా కూడా అభిర్ణించుకుంటోందామె.
ఈ పని ఒత్తిడి వల్ల మహా అయితే మూడు లేదా నాలుగు గంటలకు మించి నిద్రపోలేకపోతున్నానని అంటోంది. ఇది తన హెల్త్కి, చర్మానికి కూడా మంచిది కాదని తన వాదన వినిపోస్తుందామె. ప్రజలు తమ పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతలు, ఆఫీస్ పని ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకునే సులువైన టెక్నిక్ని కనుగొంటే బాగుండనని అంటోంది సనాయ్. తాను మాత్రం ప్రధాని పీఠం ఎక్కినా.. ఇంటి చాకిరీ, పని ఒత్తిడి తప్పడం లేదని బోరుమంటోంది. అంతేగాదు ఆఫీస్లో ఫైళ్లన్నీ చూసే సమయం లేక అవి ఇంటికి తీసుకొచ్చి క్షుణ్ణంగా చదివి సంతకాలు చేయడంతోనే సరిపోతోందని ఆవేదనగా చెబుతోంది.
పైగా ఆ కారణంగానే దేశ భవిష్యత్తు గురించి కనీసం ఆలోచించే అవకాశం కూడా తనకు చిక్కడం లేదంటూ ఆందోళన పడిపోతోంది ఈ జపాన్ మహిళా పీఎం సనాయ్. ఒక దేశాన్ని నడిపే అధినేత అయినా..ఇంటిపనుల్లో మాత్రం ఆడవాళ్లకు ఎలాంటి వెసులుబాటు ఉండదు కదా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అంతేగాదు సమానత్వం అంటూ ఏవో కబుర్లు చెబుతారు గానీ..కానీ అదెక్కడ మచ్చుకైనా కనిపిస్తుందా అని నిలదీస్తున్నారు మరికొంతమంది నెటిజన్లు.
ఇదీ చదవండి: రైలు ఆగిన తగ్గని జోష్! జస్ట్ 90 సెకన్లలో మోదీకి ఏఐ పాఠాలు..


