శాండ్‌విచ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా ఐడియా అదుర్స్‌..! | Rameshwaram Cafes Dosa Wrap Is Giving Airport Goes Viral | Sakshi
Sakshi News home page

దోసె ఇలా దొరికితే..శాండ్‌విచ్‌ ఎవరికి కావాలి? ఐడియా అదుర్స్‌

Oct 16 2026 1:44 PM | Updated on Oct 16 2026 2:12 PM

Rameshwaram Cafes Dosa Wrap Is Giving Airport  Goes Viral

దోసెలంటే ఇష్టపడని వారెవరు ఉంటారు. అయితే వాటిని హడావిడిగా తినేలేం. చక్కగా ప్లేటులో నెమ్మదిగా తింటూనే ఆస్వాదించాలి. కాబట్టి ‍ప్రయాణాల్లో శాండ్‌విచ్‌, బర్గర్‌లతో సరిపెట్టేస్తాం. ఇష్టం లేకున్నా అవే తింటాం. ఎందుకంటే సౌకర్యవంతంగా ఇబ్బంది లేకుండా తినాలంటే అవే బెటర్‌. మరి దోసెని కూడా అలానే అందిస్తే..! అదెలా సాధ్యం అనకండి సామీ. ఎందుకంటే దాన్ని సాధ్యచేసి చూపింది మన రామేశ్వరం కేఫ్‌. ఎలాగో తెలుసా..!.

చక్కగా అప్పుడే తయారు చేసిన దోసెను చక్కగా ర్యాప్‌గా మార్చేశారు. అదెలా అంటే..ప్రయాణంలో ఇబ్బంది లేకుండా ఈ సంప్రదాయ వంటకాన్ని ఆస్వాదించేలా ఒక మార్గాన్ని అందించింది బెంగళూరు విమానాశ్రయంలోని 'ది రామేశ్వరం కేఫ్'. వంటగదిలో అప్పుడే తయారుచేసిన ఫ్రెష్‌ దోసలో ఆలూ మసాలా పొరలుగా వేసి, చట్నీతో వడ్డిస్తారు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా ర్యాప్‌గా చుట్టి అరటి ఆకులు, ఫాయిల్‌ పేపర్‌లో చుట్టి ప్యాక్‌ చేస్తారు. 

దీని ఫలితంగా ప్రయాణికులు ప్లేట్‌, చెంచాలు, ఫోర్కులు వంటివి అవసరం లేకుండా దోసెను హాయిగా ఆస్వాదిస్తారు. విమానం ఎక్కడానికి హడావిడిగా ఉండే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా మార్చింది. దీని వల్ల ఎయిర్‌పోర్ట్‌లో దొరికే శాండ్‌విచ్‌లు, ప్యాక్‌ చేసే స్నాక్స్‌కు బదులుగా ఈ కమ్మటి దోసె ర్యాప్‌ చక్కటి ప్రత్యామ్నాయం. చాలామంది నెటిజన్లు దీన్ని ప్రయత్నించి ఈ దోసె ర్యాంప్‌ చాలా బాగుంది, మంచి ఆలోచన అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

 

ఇదీ చదవండి: గర్బా నృత్యంలో అడుగులు కదిపిన ఐఏఎఫ్‌ చీఫ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement