గుజరాత్లోని వడోదరలో నవరాత్రి వేడుకలో జరిగే గర్బా నృత్యంలో ఐఏఎస్ చీప్ ఏపీ సింగ్ అడుగులు కదిపారు. వడోదరలో ప్రసిద్ధి చెందిన 'యునైటెడ్ వే ఆఫ్ బరోడా నవరాత్రి గర్బా మహోత్సవ్ 2026 మూడవ రోజు ముఖ్య అతిధిగా హజరయ్యారు ఏపి సింగ్. ఆయన ముదురు నీలం రంగు కుర్తా, మ్యాచింగ్ తలపాగా, దుపట్టా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి మరి ఈ నృత్యంలో పాల్గొన్నారు. అక్కడ ఇతర నృత్యకారుల తోపాటు లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. అక్కడి ఆనందరకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ..ఉత్సాహంగా గడిపారు.
ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయన తోపాట ఆనందంగా అడుగులు కదిపారు. అత్యంత కూల్గా పేరుగాంచిన ఐఏఎఫ్ చీఫ్ నిర్వాహక కమిటీ సభ్యుడు, ఒక భద్రతా సిబ్బందితో కలిసి ఐఏఎఫ్ చీఫ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతేగాదు సాంప్రదాయ 'తీన్ తాల్' గర్బా నృత్య రీతుల్లో కొన్ని అడుగులు వేసి అక్కడి వారిని ఆకట్టుకున్నారు కూడా. అలాగే పండుగ సాంప్రదాయల్ని గౌరవిస్తూ..ఇతర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన 'మా చంద్రఘంట దేవి ఆరతి' కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు కూడా.
ఆయన తీరు యుద్ధవిమానాలను నడపడంలోనే కాదు..డ్యాన్స్లో కింగే అని తన నృత్య ప్రదర్శనతో చూపించారు. సింగ్ దళాధిపతిగా తన పదవీకాలాన్ని ముగించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. మరోవైపు, నవరాత్రి వేడుకల్లో ఆయన కనిపించడం, కాక్పిట్ అధికారిక విధులకు దూరంగా ఒక చిన్నపాటి అందమైన క్షణంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.
ఇదీ చదవండి: ఇది కదా మహిళా శక్తి! 350 మంది మహిళల వీర గర్బా..వీడియో వైరల్


