తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ మలయప్పస్వామి వారు మోహినీ అలంకారంలో (జగన్మోహనాకారుడిగా) భక్తులకు దివ్యమైన దర్శనమిస్తారు.
ఈ అలంకారంలో స్వామివారు పల్లకీపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.
భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది.
అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు


