సాక్షి, అన్నమయ్య జిల్లా: చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతల దాడుల వెనుక చంద్రబాబు, నారా లోకేశ్ ఉన్నారని ఆయన ఆరోపించారు. దాడుల పర్యవసానాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దిరెడ్డి హెచ్చరించారు.
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై దాడుల అంశంపై పెద్దిరెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి.. వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి వ్యవహారశైలి పైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, పోలీసులు టీడీపీ కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. పుంగనూరులో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని, వీటి పర్యవసానాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పెద్దిరెడ్డి మరో కీలక డిమాండ్ చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని, అలా జరగకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
🚨 వైసీపీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. కూటమి ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదా? అందుకేనా ఈ విద్వంసం? తాజాగా పుంగనూరు మున్సిపాలిటీ లో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ వాహనాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు #LocalBodyElections2026 #AnnamayyaDistrict
— UttarandhraNow (@UttarandhraNow) October 16, 2026
అంతకుముందు.. పుంగనూరు మున్సిపాలిటీ నామినేషన్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు, కాన్వాయ్లో ఉన్న ఆరు వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న 9 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థులు అడ్డుకుని దాడులకు తెగబబ్బారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వారిపై అకస్మాత్తుగా దాడి హత్యాయత్నం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాహనాలు విధ్వంసం చేశారు. పుంగనూరు ఎన్.ఎస్.పేట లోని బసవరాజా జూనియర్ కాలేజీలో మెయిన్ గేట్ వద్ద ఎంపీ మిథున్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.
చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. పుంగనూరులో టీడీపీ మూకల హింసాకాండ వైసీపీ లోక్ సభ లీడర్ మిథున్ రెడ్డి గారికాన్వాయ్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు పుంగనూరు మున్సిపాలిటీలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు. వైసీపీ వాహనాలు ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు. https://t.co/dJfmopySxh
— YSRCP Italy (@YSRCP_Italy) October 16, 2026
అనంతరం, నామినేషన్ సెంటర్లో రెండు నామినేషన్లు స్వీకరణ, మిగిలిన నామినేషన్లు తీసుకోకుండా అడ్డుకున్నారు. నామినేషన్ సెంటర్ ప్రాంగణంలోకి 400 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి చూస్తుండిపోయారు. అక్కడే ఉన్న పలు వాహనాలకు కూడా పచ్చ మూక నిప్పంటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇదీ చదవండి: మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం



