చిరంజీవితో మల్టీస్టారర్.. నాగ్ ఏం చెప్పాడంటే? | Nagarjuna Reacts Multistarrer Movie Chiranjeevi | Sakshi
Sakshi News home page

Nagarjuna-Chiranjeevi: చిరంజీవితో మల్టీస్టారర్‌పై నాగ్ స్పందన

Oct 16 2026 6:09 PM | Updated on Oct 16 2026 6:22 PM

Nagarjuna Reacts Multistarrer Movie Chiranjeevi

రీసెంట్ టైంలో సీనియర్ హీరోలు.. మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి- వెంకటేశ్ కలిసి 'మన శంకరవరప్రసాద్'లో కనిపించారు. ఇక వెంకీ అయితే కల్యాణ్ రామ్‌తో 'జనవరి 12న విడుదల' చేస్తున్నాడు. ఇదలా ఉండగానే చిరు-నాగార్జున కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రశ్న నాగ్‌కి కూడా ఎదురైంది. మరి ఈ హీరో రియాక్షన్ ఏంటంటే?

(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)

ఈనెల 30న 'ఇట్లు అర్జున' సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని థియేటర్లలో నాగార్జుననే ప్రెజెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చిరంజీవితో మల్టీస్టారర్ గురించి ప్రశ్న ఎదురవగా.. 'నేను కూడా దానికోసమే ఎదురుచూస్తున్నాను. చిరంజీవి నాకు మంచి ఫ్రెండ్. మేం కలిసినప్పుడల్లా ఏమైనా చేద్దామా అని మాట్లాడుకుంటూ ఉంటాం. దానికి కూడా టైమ్ రావాలి' అని అన్నారు.

ఇకపోతే బిగ్‌బాస్ 10వ సీజన్‌ని హోస్ట్ చేస్తున్న నాగార్జున.. తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది ఈ ఏడాది డిసెంబరు 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. లాటరీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.

(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement