మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న మూవీ కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం లోపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది.
ఈ మూవీ కథ చాలా డిఫరెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవిని మరింత కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. ఈ మూవీలో చిరును చాలా వేరియేషన్స్‌లో చూపించేలా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా.. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


