breaking news
Kaaka Movie
-
సెట్స్ నుంచి చిరంజీవి వీడియో లీక్..! షాక్‌లో అభిమానులు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఓ షూటింగ్లో చిరంజీవికి సంబంధించిన ఓ సన్నివేశం వీడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో చిరంజీవి గతంలో ఎన్నడూ చూడని విధంగా యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో సిగార్‌తో స్టైలిష్‌గా మురళీధర్ గౌడ్‌తో మాట్లాడుతున్న సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో మెగాస్టార్ కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వీడియోలోని సన్నివేశం ఈ సినిమాకు సంబంధించిందేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు చిత్రబృందం ఏవిధంగా స్పందించలేదు. ఇదీ చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో క్రేజీ సాంగ్ -
కాకా సంక్రాంతికి పక్కా మరి విశ్వంభర సంగతి ఏంటి.?
-
చిరంజీవి కాకా.. మెగాస్టార్ రోల్‌పై లేటేస్ట్ అప్డేట్..!
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న మూవీ కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం లోపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది.ఈ మూవీ కథ చాలా డిఫరెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవిని మరింత కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. ఈ మూవీలో చిరును చాలా వేరియేషన్స్‌లో చూపించేలా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా.. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ నటుడు
చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కాకా’. ఈ సినిమా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించనున్నారు. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు బాబీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.‘ఓ పవర్ఫుల్ పాత్ర కోసం ప్రముఖ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్‌ను ‘కాకా’ చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ సినిమాలో ఆయన అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సెట్లో భారీ అగ్ని ప్రమాదం) Some characters are meant to leave a lasting impact. 🔥 Delighted to welcome the POWERHOUSE @anuragkashyap72 garu on board #Kaaka for a pivotal role. His presence is sure to add another intense layer to this high-voltage entertainer. 🙌 Worldwide Grand Release on January 13th, 2027❤️🔥 Produced by @TheKVNofficial @KvnProductions Megastar @KChiruTweets #AnaswaraRajan @Nivetha_Tweets @MusicThaman @vijaykartikdop @AntonyLRuben @artkolla @saranyapotla @konavenkat99 @Chakrif1 @vforvineeth @UrsVamsiShekar @HaashtagMedia @KaakaMovie @zeemusicsouth #KAAKAOnJan13— Bobby (@dirbobby) October 5, 2026 -
KAAKA నుంచి క్రేజీ అప్డేట్
-
KAAKA నుంచి క్రేజీ అప్డేట్
-
చిరంజీవి కాకా.. ఫుల్ జోష్‌లో మూవీ టీమ్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ మరింత జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనుల కూడా మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో పంచుకున్నారు.కాకా మూవీ డబ్బింగ్ పనులు దివ్యమైన పూజా కార్యక్రమంతో మొదలయ్యాయని తెలిపారు. ఈ మూవీ షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయని వెల్లడంచారు. ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పడానికి పూర్తి వేగంతో మా టీమ్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్త జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీలో కదిరి కాళీదాస్ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు. The dubbing works of #KAAKA commence with a divine pooja ceremony. 🎙️✨With the shoot and post-production progressing simultaneously, the team is working at full speed to set THE BLOODY BENCHMARK 🪓🔥Worldwide Grand Release on January 13th, 2027❤️🔥A @dirbobby Film 💥… pic.twitter.com/gkwkWUaRGV— KVN Productions (@KvnProductions) September 25, 2026 -
విశ్వంభర వర్సెస్ కాకా! పొంగల్ బరిలో మెగా ట్విస్ట్
-
చిరు లీక్స్.. కాకాలో మెగాస్టార్ రోల్ ఇదే..!
చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే మెగాస్టార్ అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించి లీక్స్ చేస్తుంటారు. గతంలో చాలాసార్లు టైటిల్స్ లీక్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంటారు. తాజాగా కాకాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ మూవీలోని తన పాత్ర పేరును బయట పెట్టేశారు. ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తన రోల్ వెల్లడించారు.కాకాలో తాను కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనున్నట్లు చిరు వెల్లడించారు. తన పక్కనే ఉన్న యాంకర్ స్రవంతిని చూపిస్తూ.. తన ఊరి పేరునే తన క్యారెక్టర్లో పెట్టుకున్నానని నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాకా… కదిరి కాళిదాస్ ❤️🔥❤️🔥❤️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027🔥#KAAKAOnJan13 pic.twitter.com/tfaa5Nmadk— Kaaka (@KaakaMovie) September 20, 2026 -
కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను
-
కాకా మూవీపై క్లారిటీ ఆ డేట్ కే థియేటర్లలోకి!
-
సంక్రాంతికి వచ్చేది కాకానే.. మరి విశ్వంభర పరిస్థితేంటి?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న మూవీ కాగా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో చిరు నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగనుంది. అయితే చిరంజీవి నటించిన మరో మూవీ విశ్వంభర. ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే డేట్ ప్రకటించిన కాకా వాయిదా పడనుందనే టాక్ వినిపించింది. దీంతో కాకా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.కాకా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో కాకా వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్‌పడింది. మరి విశ్వంభర రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027. First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy— KVN Productions (@KvnProductions) September 17, 2026 -
మెగాస్టార్ డబుల్ ధమాకా ఒకే నెలలో చిరు 2 సినిమాలు
-
చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ .. ‘అమ్ములు ’లుక్ రిలీజ్
హార్ట్ ఆఫ్ కాకా అంటే ఎవరో తెలుసా? అమ్ములు. ఈ అమ్ములు ఎవరో కాదు నటి అనస్వర రాజన్. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’లో అనస్వర రాజన్ చేస్తున్న పాత్ర పేరు అమ్ములు, నివేతా పేతురాజ్, సునీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు చిరంజీవి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ అమ్ములు రోల్లో అనస్వర రాజన్ నటిస్తున్నారని మంగళవారం (సెప్టెంబరు 8) ఆమె పుట్టినరోజు సందర్భంగా వెల్లడించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ‘హార్ట్ ఆఫ్ కాకా’ అని పేర్కొన్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. Happy Birthday to the'HEART OF KAAKA', Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg— Kaaka (@KaakaMovie) September 8, 2026


