హార్ట్ ఆఫ్ కాకా అంటే ఎవరో తెలుసా? అమ్ములు. ఈ అమ్ములు ఎవరో కాదు నటి అనస్వర రాజన్. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’లో అనస్వర రాజన్ చేస్తున్న పాత్ర పేరు అమ్ములు, నివేతా పేతురాజ్, సునీల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు చిరంజీవి. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.
ఈ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ అమ్ములు రోల్‌లో అనస్వర రాజన్ నటిస్తున్నారని మంగళవారం (సెప్టెంబరు 8) ఆమె పుట్టినరోజు సందర్భంగా వెల్లడించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ‘హార్ట్ ఆఫ్ కాకా’ అని పేర్కొన్నారు. వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది.
Happy Birthday to the
'HEART OF KAAKA', Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..
Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg— Kaaka (@KaakaMovie) September 8, 2026


