మేము మహిళలమే.. మా గోడు పట్టదా?: సబిత, సునీత ఆవేదన | Telangana Assembly Session Live Updates On Sep 9th 2026, BRS Suspended From House Amid Protests And We Want Justice Slogans | Sakshi
Sakshi News home page

మేము మహిళలమే.. మా గోడు పట్టదా?: సబిత, సునీత ఆవేదన

Sep 9 2026 10:04 AM | Updated on Sep 9 2026 11:51 AM

Telangana assembly session Live Updates on 09th Sep

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ ఇది: హరీష్‌

  • మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్‌..
  • ఇది బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్ కాదు..  
  • ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్
  • ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే..
  • రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్‌ఎస్‌ని బయటకు పంపండి అంటున్నాడు.
  • నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం రేవంత్‌ రెడ్డి గుర్తుంచుకోవాలి.


మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్‌..

  • కాంగ్రెస్ పార్టీలో భట్టి ముఖ్యమంత్రి అయితే మొదట సంతోష పడేది బీఆర్‌ఎస్‌.
  • చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీకి లేదు
  • మల్లారెడ్డి తిరుమలలో ఉంటే ఎలా సస్పెండ్ చేస్తారు?.
  • స్పీకర్ ఒక పేరు.. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక పేరు చదివారు.
  • చావు డప్పు కొట్టడానికి దళితులు వెళ్తే నర్సారెడ్డి ఎవరు?
  • యాదాద్రిలో అందరి ముందే భట్టి విక్రమార్కను కింద కుర్చోబెట్టారు.
  • ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డికి కుల అహంకారం ఉంది..
  • తెలంగాణలో శాంతిభద్రతలు సీఎం పరిధిలోకి రావా?
  • లా అండ్ ఆర్డర్ సరిచేయాల్సిన బాధ్యత సీఎంపై లేదా?

సభలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు: బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు.

  • సభ బయట కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదా?
  • స్పీకర్‌ను కలుస్తాం.. అంటే టైం ఇవ్వడం లేదు.
  • బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు తెస్తే ఎందుకు ఆపడం లేదు..
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మాత్రం కనీసం అసెంబ్లీలో నిలుచోనివ్వడం లేదు.

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కోవా లక్ష్మీ చిట్ చాట్

  • మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేదు
  • స్పీకర్ బాధపడ్డారు అని తెలుసుకొని కేసీఆర్ విచారం వ్యక్తం చేయాలని మాకు చెప్పారు.
  • మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి మేము కూడా మహిళలమే కదా!
  • మాపై దాడి జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సానుభూతి వస్తుంది.. ఫోన్ చేసి చెప్తున్నారు.
  • సభ జరిగినప్పుడు బయట ఏదైనా ఘటన జరిగితే అసెంబ్లీలో ప్రకటన చేస్తారు.
  • కానీ ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగితే కనీసం ప్రకటన లేదు.
  • దెబ్బ తగిలింది మాకు.. మా గురించి మాట్లాడడం లేదు.
  • వాళ్ళు ఏమో అమ్మ గురించి.. వాళ్ళ అక్కల గురించి ఆలోచించారు
  • సభలో మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వకుండా నాటకాలు అంటున్నారు.
  • మాకు జరిగిన అవమానంపై అధికార మహిళా సభ్యులు మా వైపు చూడలేదు.
  • మాపై ఇష్టం వచ్చినట్లు మగ పోలీసులు ప్రవర్తించారు
  • సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకుంటే మేము కింద పడిపోయే వాళ్ళం
  • హరీష్ రావు, కేటీఆర్ చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు.
  • మహిళ శాసన సభ్యుల చుట్టూ మగ పోలీసులను పెట్టి రాజకీయం చేశారు.
  • మేము మహిళలమే కదా.. మాకు జరిగిన అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టరు?
  • దళితుల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని భట్టి విక్రమార్క అంటున్నారు
  • మహిళల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం కాదా!
  • మాకు జరిగిన అవమానంపై సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి.
  • ఎక్కడ ఏం జరిగిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం వస్తుంది.
  • మాపై జరిగిన దాడి గురించి ప్రభుత్వానికి ఎందుకు సమాచారం రాలేదు.
  • సీఎంకు మహిళల గురించి పట్టింపు లేదు .
  • శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం మా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తున్నారు

 

కాసేపట్లో లోక్‌భవన్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు..

  • ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • కాసేపట్లో లోక్‌భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.

  • బీఆర్‌ఎస్‌ల్వీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నం.
  • కేటీఆర్‌, హరీష్‌రావును అడ్డుకున్న మార్షల్స్‌.
  • స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రయత్నం.
  • అడ్డుకు​న్న మార్షల్స్‌పై ఎమ్మెల్యేల ఆగ్రహం. 

 

  • స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.
  • స్పీకర్‌ చాంబర్‌ ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆపేసిన మార్షల్స్‌
  • సస్పెండ్ అయ్యారు కాబట్టి ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లొద్దన్న చీఫ్ మార్షల్ కరుణాకర్.
  • స్పీకర్‌ను కలవనీయకపోవడంతో మరికాసేపట్లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
     

తలసాని శ్రీనివాస్ చిట్ చాట్.

  • బీఆర్‌ఎస్‌ రెండు అంశాలపై సభలో ఆందోళన చేసింది.
  • మహిళలపై దాడి చేస్తే నిరసన చేయవద్దా?
  • మాజీ సీఎం, తెలంగాణ సాధించిన నేత చావు కోరుకుంటే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా?
  • సెషన్ మొత్తం ఎలా సస్పెండ్ చేస్తారు?
  • దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది.
  • దళితుల పట్ల ప్రేమ ఉంటే భట్టి విక్రమార్కను సీఎం చేయాలి.
     

తెలంగాణ అసెంబ్లీ కాసేపు వాయిదా.. 

  • మండలి నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌
  • శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌
  • వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
  • సభలో మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు..
  • అందుకే మేము వాకౌట్ చేస్తున్నాం: మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి.
  • ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి..
  • సభ ఉన్నత విలువలు పాటించాలి..
  • మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొడతారట.
  • ఎక్కడైనా ఇలా ఉంటుందా?.
  • దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది..
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
  • మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు
  • నిన్న సభలోకి వస్తే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు
  • సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలి
  • మా సభ్యులు సభలోకి వచ్చేవరకూ మా నిరసన కొనసాగుతుంది..
  • మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి
  • నిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి..

 

వీరిపై సస్పెన్షన్‌..

  • కేటీఆర్‌, హరీష్‌రావు, కౌశిక్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి
  • అనీల్‌ జాదవ్‌, కోవాలక్ష్మీ మాణిక్‌రావు, గంగుల కమలాకర్‌, సంజయ్‌ కుమార్‌, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి
  • మల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్‌, ప్రశాంత్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై సస్పెన్షన్‌‌. 
     

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌..

  • శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
  • సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలి: శ్రీధర్‌బాబు
  • ఈ సెషన్ మొత్తం  సస్పెండ్ చేసిన స్పీకర్
  • కేటీఆర్‌, హరీష్‌రావు, కౌశిక్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, మాధవరం కృష్ణారావు సస్పెండ్‌
  • మొత్తం 22 మంది సభ్యులపై సస్పెన్షన్‌‌.

 

  • స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన
  • కేసీఆర్‌ నివాసంపై దాడికి యత్నించారని ఆందోళన 
  • జస్టిస్‌ కావాలంటూ డిమాండ్‌.

 

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..

  • రాహుల్ గాంధీపైన విమర్శలు చేస్తే నేను ఒప్పుకోము.
  • ఎవరి చావును కాంగ్రెస్ పార్టీ కోరుకోదు.
  • కేసీఆర్ ఆరోగ్యంగా వందేళ్ళు బతకాలని కోరుకుంటాం.
  • ప్రజలకు కేసీఆర్ సేవ చేయాలని కోరుకుంటాం.
  • కరీంనగర్‌లో కేటీఆర్.. రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావు అని అన్నారు
  • దళితులు నడిచిన చోట శుద్ధి చేశారు.. ఏ కాలంలో ఉన్నామో తెలియడం లేదు.
  • సభ సజావుగా నడిచేలా ప్రతిపక్షం సహకరించాలి
  • బీఆర్‌ఎస్‌ ఆందోళన విరమించాలి.
  • లేదంటే సభ నడపడానికి మేము కార్యాచరణ తీసుకుంటాం

శాసనసభలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన

  • పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు


డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • అసెంబ్లీలో సభాపతితో వాగ్వాదం చేయడం కరెక్ట్ కాదు.
  • సభ్యసమాజం ఆశ్చర్యపోయే విధంగా బీఆర్‌ఎస్‌ నాయకుల తీరు ఉంది.
  • బీఆర్‌ఎస్‌ చేసిన అవమానాలను భరించడానికి ఇక ఓపిక లేదు.
  • ఇంకా ఎంతకాలం దళితులను అవమానిస్తారు?
  • బీఆర్‌ఎస్‌ సవాల్‌కు భయపడే వాళ్ళు ఎవరూ లేరు.
  • మీ బెదిరింపులకు ఉడత ఊపులకు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు!
  • ఇలా దాడులు చేసి బతుకుదాం అనుకుంటున్నారు

 

కేటీఆర్ కామెంట్స్‌..

  • మాపై కేసులు పెట్టడం సహజమే
  • మా ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి వాడుతున్నారు
  • సైబర్ క్రైమ్‌లో మేము కూడా ఫిర్యాదు చేస్తాం.


శాసన మండలి..

  • మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కామెంట్స్‌..
  • మా సభ్యులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలి
  • సభ్యుల వాదనలను వినిపించేలా అవకాశం ఇవ్వాలి
  • కుట్రలో భాగంగానే పోలీసులతో ఆ విధంగా వ్యవహరించేలా చేశారు

భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • బీఆర్‌ఎస్‌ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.
  • బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌ తల్లిని దూషించారు.
  • ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన శుద్ధి ఘటనపై సభలో చర్చ జరగాలి.
  • రోడ్డుపై దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన దుర్మార్గపు పార్టీ బీఆర్‌ఎస్‌.
  • బీఆర్‌ఎస్‌ సభ్యుల ప్రవర్తన మంచిది కాదు.
  • అంతా చేసి సభకు వచ్చి న్యాయం కావాలంటారా? 
  • ఆత్మ గౌరవంతో తెలంగాణ ఏర్పడింది.
  • తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు?
  • గత పదేళ్లలో ప్రతిపక్షాలు పొడియంలోకి వచ్చి ఆందోళన చేయలేదు.
  • బీఆర్‌ఎస్‌ చేసిన శుద్ధి కార్యక్రమంపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
     

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

  • సభలో బీఆర్‌ఎస్‌ ఆందోళనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • శుద్ధి పేరిట బీఆర్‌ఎస్‌ చేసిన కార్యక్రమంపై చర్చ జరపాలని మంత్రి డిమాండ్
  • దళితులు ఆందోళన చేస్తే శుద్ధి కార్యక్రమం చేస్తారా?
  • దళితులను ప్రతిక్షణం అవమానిస్తున్నారు
  • బీఆర్‌ఎస్‌ ఆందోళనపై స్పీకర్ అసంతృప్తి
  • సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి పొడియం ముందు ఆందోళన ఎలా చేస్తారు?
  • ఏ అంశం అయినా రాత పూర్వకుండా ఇస్తే పరిశీలన చేస్తా: స్పీకర్.

 

  • అసెంబ్లీలో గందరగోళం.. 

అసెంబ్లీ మీడియా పాయింట్..

  • ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్‌.
  • దళితులను అవమానించినందుకు ముందు శాసనసభలో క్షమాపణ చెప్పి సభలోకి అడుగు పెట్టాలి
  • లేదంటే వాళ్ళను సభలోకి అడుగుపెట్టనీయం
  • కేసీఆర్‌కు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని చెప్పాలి
  • బీఆర్‌ఎస్‌ అనేది అంటరాని పార్టీ
  • బీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టడమే మా లక్ష్యం
  • బీఆర్‌ఎస్‌లో ముగ్గురో లేక కోటి మంది కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీనో తేల్చుకుందాం
  • కొట్లాడాలి కానీ బట్టలు విప్పుకుని తిరగాలా?
  • అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఉనికి కోసం అలజడులు సృష్టిస్తున్నారు
  • దళితులతో పెట్టుకున్న ఏ పార్టీ కి మనుగడ లేదు

ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కామెంట్స్‌

  • దళితులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణం
  • బీఆర్‌ఎస్‌ పార్టీ దళితులపై చిన్న చూపు చూస్తుంది
  • దళిత స్పీకర్‌ను అవమానించారు
  • ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలి
  • లెందటే బీఆర్‌ఎస్‌ దళిత వ్యతిరేక పార్టీగా చూడాల్సి వస్తుంది. 
     

మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో రగడ..

  • అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కామెంట్స్‌..
  • దళితులకు బీఆర్‌ఎస్‌ క్షమాపణ చెప్పాలి
  • కేసీఆర్‌ సభకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.

  • కాసేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
  • ప్రశ్నోత్తరాలతో సభ మొదలుకానుంది.
  • నేడు పంచాయతీరాజ్​ సవరణ చట్టానికి సంబంధించిన కీలక బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు.
  • తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు-2026పై సభలో చర్చ జరగనుంది.
  • గ్రామీణపాలన, పంచాయతీరాజ్​ వ్యవస్థకు సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య చర్చ కొనసాగనుంది. 

బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం..

  • మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం,
  • కేసీఆర్ నివాసం వద్ద పోలీసుల సమక్షంలో ర్యాలీ,
  • కేసీఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు,
  • రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన  బీఆర్ఎస్

బీజేపీ వాయిదా తీర్మానం..

  • అసెంబ్లీలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్,
  • ఉద్యోగుల పెండింగ్ డీఏల చెల్లింపులపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement