60 అడుగుల ఎత్తు నుంచి దూకిన మాళవిక మోహనన్ | Malavika Mohanan jumped from a height of 60 feet for Sardar-2 Movie | Sakshi
Sakshi News home page

60 అడుగుల ఎత్తు నుంచి దూకిన మాళవిక మోహనన్

Sep 8 2026 11:44 PM | Updated on Sep 9 2026 12:01 AM

Malavika Mohanan jumped from a height of 60 feet for Sardar-2 Movie

హీరోయిన్ మాళవిక మోహనన్ ‘సర్దార్-2’ సినిమాలో యాక్షన్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆమె ఏకంగా 60 అడుగుల ఎత్తు నుంచి తాడు సహాయంతో డైవ్ చేసిందట. అయితే అది నిజంగా కాదు, సినిమా కోసమే.

విమానం నుంచి దూకుతున్న అనుభూతి కలిగేలా షూటింగ్‌లో భారీ బ్లోయర్లను ఏర్పాటు చేశారని మాళవిక తెలిపింది. అంత ఎత్తు నుంచి కిందకు వస్తూనే శరీర భంగిమను కాపాడుకోవడంతో పాటు డైలాగ్ కూడా చెప్పాల్సి వచ్చిందట. కెరీర్‌లో తాను చేసిన అత్యంత క్రేజీయెస్ట్ సీన్ ఇదేనని చెప్పుకొచ్చింది. ఎంత పక్కా జాగ్రత్తలు తీసుకొని చేసినప్పటికీ అంత ఎత్తు నుంచి కాస్త కిందకు జారాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. కానీ హీరోయిన్ మాళవిక మాత్రం ఎంజాయ్ చేశానని చెబుతోంది.

ఇక హీరో కార్తీ, తనకు ఒక కామన్ పాయింట్ ఉందని మాళవిక తెలిపింది. ఇద్దరికీ భోజనం కంటే అల్పాహారం, స్నాక్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పింది.

పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్‌ 2’. మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌జే సూర్య విలన్‌ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement