మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ మరింత జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనుల కూడా మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో పంచుకున్నారు.
కాకా మూవీ డబ్బింగ్ పనులు దివ్యమైన పూజా కార్యక్రమంతో మొదలయ్యాయని తెలిపారు. ఈ మూవీ షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయని వెల్లడంచారు. ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పడానికి పూర్తి వేగంతో మా టీమ్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్త జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీలో కదిరి కాళీదాస్ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు.
The dubbing works of #KAAKA commence with a divine pooja ceremony. 🎙️✨
With the shoot and post-production progressing simultaneously, the team is working at full speed to set THE BLOODY BENCHMARK 🪓🔥
Worldwide Grand Release on January 13th, 2027❤️🔥
A @dirbobby Film 💥… pic.twitter.com/gkwkWUaRGV— KVN Productions (@KvnProductions) September 25, 2026


