మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా ఓ షూటింగ్‌లో చిరంజీవికి సంబంధించిన ఓ సన్నివేశం వీడియో లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో చిరంజీవి గతంలో ఎన్నడూ చూడని విధంగా యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో సిగార్‌తో స్టైలిష్‌గా మురళీధర్ గౌడ్‌తో మాట్లాడుతున్న సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో మెగాస్టార్ కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వీడియోలోని సన్నివేశం ఈ సినిమాకు సంబంధించిందేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు చిత్రబృందం ఏవిధంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో క్రేజీ సాంగ్


