ఖాతాలో రూ. 3.7 లక్షలు మాయం : ఎస్‌బీఐకి షాకిచ్చిన కేరళ హైకోర్టు | Retired principal loses Rs 3.7 lakh to cyber fraud Kerala High Court orders SBI refund | Sakshi
Sakshi News home page

ఖాతాలో రూ. 3.7 లక్షలు మాయం : ఎస్‌బీఐకి షాకిచ్చిన కేరళ హైకోర్టు

Oct 19 2026 3:38 PM | Updated on Oct 19 2026 4:21 PM

Retired principal loses Rs 3.7 lakh to cyber fraud Kerala High Court orders SBI refund

కేరళ హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది.  సైబర్  నేరగాడి చేతిలో రూ. 3.73 లక్షలు పోగొట్టుకున్న ఒక  రిటైర్డ్‌  కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఆ మొత్తాన్ని రీఫండ్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ని ఆదేశించింది. థర్డ్ పార్టీ మోసాల వల్ల అనధికారిక లావాదేవీలు జరిగితే, కస్టమర్ లేదా బ్యాంక్ తప్పు లేనప్పుడు వినియోగదారుడికి 'జీరో లయబిలిటీ' వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని కోర్టు పేర్కొంది. అనధికార లావాదేవీల సమాచారం వచ్చిన 3 పనిదినాల్లోగా బ్యాంకుకు తెలియజేస్తే వినియోగదారుడిపై ఎటువంటి బాధ్యత ఉండదని  గుర్తు చేసింది.

ఒక సైబర్ మోసగాడు ఒక రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపాల్  రెమాదేవి పొదుపు ఖాతా నుండి రూ. 3.73 లక్షలు కొట్టేశాడు.  డెబిట్ కార్డ్ బ్లాక్ కాబోతోందని, దానిని ఆన్‌లైన్‌లో పునరుద్ధరించుకోవచ్చంటూ  2019 జూలై 13న బాధితురాలికి ఒక SMS వచ్చింది. ఆ తర్వాత అదే నంబర్ నుండి కాల్ చేసి, కార్డ్ యాక్టివేషన్ కోసం వివరాలు,   ఓటీపీ (OTP) చెప్పాలని కోరాడు. దీంతో ఆమె OTP పంచుకోవడంతో వెంటనే ఖాతా నుండి రూ. 3.73 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో  సొమ్ము డెబిట్ అయిన వెంటనే ఆమె కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను బ్లాక్ చేయించారు. అదే రోజున బ్యాంక్‌తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి 'స్పైస్ డిజిటల్ వాలెట్ల'ను (Spice Digital wallets) సృష్టించి, డబ్బును బదిలీ చేసినట్లు తేలింది. అయినా డబ్బు తిరిగి రాకపోవడంతో, ఆమె బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసి, ఈ విషయాన్ని తిరిగి పరిశీలించాలని ఆదేశించినప్పటికీ, అంబుడ్స్‌మన్ మళ్లీ ఆమె ఫిర్యాదును తిరస్కరించారు. దీంతో ఆమె ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. 

ఇదీ చదవండి:దీపావళి యాడ్‌ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!

ఈ కేసు విచారణలో ఆ మహిళ మోసపూరిత లావాదేవీల గురించి అదే రోజు బ్యాంకుకు ఫిర్యాదు చేసినప్పటికీ, డబ్బును తిరిగి ఇప్పించడానికి బ్యాంకు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసిన జస్టిస్ హరిశంకర్ వి. మీనన్, ఆమె ఫిర్యాదును తిరస్కరిస్తూ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేశారు. పిటిషనర్ ఫిర్యాదు చేశారని SMS ద్వారా స్పష్టమవుతోందన్నారు. అదే రోజు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ, డెబిట్ అయిన మొత్తాలను పిటిషనర్ ఖాతాకు తిరిగి జమ చేసేందుకు బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్టోబర్ 5 నాటి ఉత్తర్వులో కోర్టు  స్పష్టం చేసింది. పోలీసు విచారణలో కూడా బాధితురాలికి ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదని తేలినందున, ఆర్‌బిఐ సర్క్యులర్ ప్రకారం  బ్యాంకు 4 వారాల్లోగా రూ. 3.73 లక్షల మొత్తాన్ని బాధితురాలు రేమాదేవి ఖాతాలో జమ చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: నీటి బుడగ జీవితం గురించి బోధిస్తుండగానే ప్రాణం పోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement