జీవితంలో ఏ క్షణం ఏ మలుపు తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ప్రార్థనల సమయంలో జీవితం ఎంత క్షణభంగురమైందో వివరించిన కొన్ని క్షణాల్లోనే విధి రాతకు తలవంచిన విషాదకరమైన సంఘటన ఈక్వడార్‌లో చోటుచేసుకుంది. లైవ్‌స్ట్రీమ్ అవుతున్న ప్రార్థనల (మస్) సమయంలో వెనుక ఉన్న పెద్ద సిలువ (Crucifix) తలపై పడటంతో ఒక కేథలిక్ మతగురువు అక్కడికక్కడే మరణించిన ఘటన విషాదాన్ని నింపింది.
గుయాకిల్ ఆర్చ్‌డయోసెస్ ప్రకటన ప్రకారం శనివారం ఈ దుర్గటన జరిగింది. గుయాకిల్‌లోని 'అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్' చర్చి వికారి (పూజారి) ఫాదర్ ప్యాట్రిసియో ఆల్ఫ్రెడో శాంచెజ్ మొలినారి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లలో సమయం వృధా చేయకుండా దేవునికి, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని హితబోధ చేశారు. ఇక్కడున్న మనమందరం కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం. దేవునితో గడిపే సమయంతో పోలిస్తే మిగతావాటికి మనం కేటాయించే సమయానికి పెద్దగా అర్థం ఉండదని ఆయన భక్తులకు బోధించారు.ఆ బోధన ముగించి, ప్రజలను ఆశీర్వదించేందుకు ప్రార్థన ప్రారంభిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు మృత్యువు, బుద్భుత ప్రాయమైన జీవితం గురించి మాట్లాడిన ఆయన వెనుక గోడకు ఉన్న భారీ సిలువ ఒక్కసారిగా ఆయనపై పడిపోయింది. తల వెనుక భాగంలో బలంగా తాకింది. ఈ దృశ్యాలన్నీ లైవ్ ప్రసారంలో రికార్డ్ అయ్యాయి (ఆ తర్వాత ఈ వీడియోను తొలగించారు).
Tragedy in church: Father tragically loses his life after a heavy crucifix falls on him. https://t.co/KF9sncgOy6
— News _From _Dcoder (@UliGodswill) October 19, 2026
> ఇదీ చదవండి: ఖాతాలో రూ. 3.7 లక్షలు మాయం : ఎస్‌బీఐకి షాకిచ్చిన కేరళ హైకోర్టు
సిలువ పడిన వెంటనే ఆయన కిందపడిపోగా, చర్చిలోని భక్తులు కేకలు వేస్తూ ఆయనకు సహాయం చేయడానికి పరుగెత్తారు. అంబులెన్స్, అత్యవసర సిబ్బంది వచ్చినప్పటికీ ఆయన అప్పటికే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఫాదర్ మొలినారి ఆకస్మిక మృతి పట్ల గుయాకిల్ ఆర్చ్‌డయోసెస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆయన జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే ఆ భారీ సిలువ గోడ నుండి ఎలా ఊడిపడిందనే దానికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చర్చి అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!


