లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో హిందీ వార్తాపత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహ్మద్ నసీమ్ అహ్మద్ (50) దారుణ హత్య కలకలం రేపింది. దీపావళి ప్రకటనకు సంబంధించిన వివాదం కారణంగా 'దైనిక్ జన్వానీ' అనే హిందీ జర్నలిస్ట్ అహ్మద్‌ను కొట్టి చంపేశారు. ఆదివారం జరోఠీ రోడ్‌లో ఫ్లోర్ మిల్లులో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా తన పత్రికకు ప్రకటన (అడ్వర్టైజ్‌మెంట్) కోరేందుకు అహ్మద్ అక్కడికి వెళ్లారు. తన సహచరుల ఇద్దరు మహిళలతో సహా మరో ముగ్గురు సహచరులతో కలిసి ఒక పిండి మిల్లు యజమాని అశోక్ కుమార్ గుప్తాను సంప్రదించారు. అక్కడ యాడ్ ఇవ్వడంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వ్యాపారి నసీమ్‌ను 'ఫేక్ జర్నలిస్ట్ అని దూషించడంతో పాటు, కొందరు వ్యక్తులు కలిసి ఆయనపై తీవ్రంగా భౌతిక దాడికి దిగారు. చాతి, శరీర భాగాలపై విచక్షణారహితంగా పిడి గుద్దులు కురిపించారు. దీంతో తీవ్రంగా గాయపడిన నసీమ్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది గుంపు దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షి సలావుద్దీన్ తెలిపారు.
ఇదీ చదవండి: పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
हापुड़ में पत्रकार की पीट-पीटकर हत्या ! उत्तर प्रदेश के हापुड़ में जनवाणी अखबार के पत्रकार नसीम अहमद की पिटाई के बाद मौत हो गई। वह दिवाली का विज्ञापन लेने फ्लोर मिल गए थे, जहां विवाद हुआ। उनके साथ मौजूद सलाउद्दीन भी घायल हुए। पुलिस के मुताबिक, शिकायत पर मुकदमे की कार्रवाई जारी है और आरोपियों की तलाश की जा रही है। आखिर पत्रकारों की सुरक्षा की जिम्मेदारी कौन लेगा? @PA #Hapur #Journalist
— गुरु प्रसाद यादव, लखनऊ (@guruprasadyada5) October 18, 2026
ఈ ఘటనపై హాపూర్ దేహాత్ పోలీస్ స్టేషన్‌లో నలుగురి పేర్లతో పాటు మరికొందరిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హాపూర్ దేహాత్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) పరాస్ మాలిక్ తెలిపారు.



