మధ్యప్రదేశ్ జిల్లా దమోహ్లోత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల పసి పాపపై 28 ఏళ్ల రౌడీషీటర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో వాడి దుర్మార్గానికి అడ్డుకట్ట పడలేదు. గట్టిగా ఏడుస్తోందని, చిన్నారిని ఇసుక కుప్ప కింద పాతిపెట్టి పారిపోయిన దారుణ సంఘటన కలకలం రేపింది.
బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఒక నిర్మాణ స్థలంలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. రాత్రి వేళ తల్లిదండ్రుల వద్ద నిద్రపోతున్న రెండేళ్ల పసిపాపను నిందితుడు అపహరించుకు పోయాడు. అనంతరం పసిపాపపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. చిన్నారి గట్టిగా ఏడవడంతో భయాందోళనకు గురైన నిందితుడు ఆమెను ఇసుక కుప్ప కింద పాతిపెట్టి అక్కడి నుండి పరారయ్యాడు.
ఇదీ చదవండి: భార్యకు సింపుల్ గిఫ్ట్ : రూ. 5 కోట్ల సర్ప్రైజ్
రాత్రి పాప కనిపించకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులు, ఇసుక కింద ఉన్న చిన్నారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని ఆశిష్ పటేల్నిగా గుర్తించారు. సంఘటన జరిగిన తర్వాత నిర్మాణ స్థలంలో పనిచేస్తున్న ఆశిష్ పటేల్ కనిపించకుండా పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ వేగవంతం చేశారు. ఇతనికి పాత నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అక్కడ మద్యనిషేధం : ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్కర్ పార్టీ దుమారం


