అక్కడ మద్యనిషేధం : ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్కర్‌ పార్టీ దుమారం | three women man consuming liquor inside Darbhanga hospital probe underway | Sakshi
Sakshi News home page

అక్కడ మద్యనిషేధం : ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్కర్‌ పార్టీ దుమారం

Oct 17 2026 5:47 PM | Updated on Oct 17 2026 6:06 PM

 three women man consuming liquor inside Darbhanga hospital probe underway

బిహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (DMCH) సర్జికల్ విభాగం భవనంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మద్యం  సేవించడం నెట్టింట చర్చకు దారాతీసింది.  దీనికి  సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజ్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు.

మద్యనిషేధం అమలులో  ఉన్న బిహార్‌లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగడం దుమారాన్ని రాజేసింది. ప్రభుత్వ ఆసుపత్రి భద్రత, వర్క్‌ప్లేస్‌లో క్రమశిక్షణపై ఆందోళనలను రేకెత్తించింది. వైరల్‌ వీడియో ప్రకారం ఆసుపత్రి భవనం మెట్ల వద్ద నలుగురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్లు కనిపించింది. మహిళలు బ్యాగ్ నుండి స్నాక్స్, ప్లాస్టిక్ గ్లాసులు తీస్తుండగా, ఒక వ్యక్తి తన నడుము వద్ద దాచుకున్న లిక్కర్ టెట్రా ప్యాకెట్‌ను తీసి వారికి ఇస్తున్నట్లు  ఇందులో రికార్డైంది.మద్యం సేవిస్తున్న మహిళలు ఆసుపత్రిలోని పారిశుధ్య కార్మికులని  కావచ్చని, పురుషుడు ట్రాలీ వర్కర్ అని ప్రచారం జరుగుతోంది. అయితే వారు ఎవరు అనే వివరాలను  అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దర్భంగా ఎస్పీ (SSP) జగన్నాథ్ రెడ్డి జలరెడ్డి, బెంటా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ను సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు.

 

ఇదీ చదవండి: 39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం

మరోవైపు ఇది పాతవీడియో అనే అనుమానాలుఉన్నాయి.  దర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు DMCH సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ చంద్ర తెలిపారు. అయితే, ఆసుపత్రి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ మాత్రం ఈ వీడియో దాదాపు ఆరు నెలల క్రితం నాటిదని పేర్కొంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది , వీడియోలో ఉన్నవారు నిజంగానే ఆసుపత్రి ఉద్యోగులా లేక అవుట్‌సోర్సింగ్ సిబ్బందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ  చదవండి:  భార్యకు సింపుల్‌ గిఫ్ట్‌ : రూ. 5 కోట్ల సర్‌ప్రైజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement