breaking news
Darbhanga Medical College and Hospital
-
అక్కడ మద్యనిషేధం : ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్కర్ పార్టీ దుమారం
బిహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (DMCH) సర్జికల్ విభాగం భవనంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మద్యం సేవించడం నెట్టింట చర్చకు దారాతీసింది. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు.మద్యనిషేధం అమలులో ఉన్న బిహార్‌లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగడం దుమారాన్ని రాజేసింది. ప్రభుత్వ ఆసుపత్రి భద్రత, వర్క్‌ప్లేస్‌లో క్రమశిక్షణపై ఆందోళనలను రేకెత్తించింది. వైరల్ వీడియో ప్రకారం ఆసుపత్రి భవనం మెట్ల వద్ద నలుగురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్లు కనిపించింది. మహిళలు బ్యాగ్ నుండి స్నాక్స్, ప్లాస్టిక్ గ్లాసులు తీస్తుండగా, ఒక వ్యక్తి తన నడుము వద్ద దాచుకున్న లిక్కర్ టెట్రా ప్యాకెట్‌ను తీసి వారికి ఇస్తున్నట్లు ఇందులో రికార్డైంది.మద్యం సేవిస్తున్న మహిళలు ఆసుపత్రిలోని పారిశుధ్య కార్మికులని కావచ్చని, పురుషుడు ట్రాలీ వర్కర్ అని ప్రచారం జరుగుతోంది. అయితే వారు ఎవరు అనే వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దర్భంగా ఎస్పీ (SSP) జగన్నాథ్ రెడ్డి జలరెడ్డి, బెంటా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ను సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు.After a viral video allegedly showed three female sanitation workers and one trolley worker consuming alcohol at Darbhanga Medical College & Hospital (DMCH) in Bihar, police registered an FIR at Benta Police Station. Can’t women also drink alcohol? The misogynistic policeman should be suspended immediately. 😐😐 https://t.co/0bNwCyIsgG— JusticeForMen (@Mr_Prajapat551) October 16, 2026 ఇదీ చదవండి: 39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతంమరోవైపు ఇది పాతవీడియో అనే అనుమానాలుఉన్నాయి. దర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు DMCH సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ చంద్ర తెలిపారు. అయితే, ఆసుపత్రి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ మాత్రం ఈ వీడియో దాదాపు ఆరు నెలల క్రితం నాటిదని పేర్కొంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది , వీడియోలో ఉన్నవారు నిజంగానే ఆసుపత్రి ఉద్యోగులా లేక అవుట్సోర్సింగ్ సిబ్బందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: భార్యకు సింపుల్ గిఫ్ట్ : రూ. 5 కోట్ల సర్ప్రైజ్ -
అధ్వానంగా మారిన బిహార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్
-
ఇక్కడ వైద్యం అంటే నరకంలో బెర్త్ కన్ఫామ్
పట్న: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇక ఆస్పత్రుల సంగతైతే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కరోనా వార్డులను చాలా పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రలను కూడా విధిగా ప్రతి రోజు శుభ్రం చేస్తున్నారు. అయితే బిహార్‌లోని ఓ ఆస్పత్రిని చూస్తే.. ఎవరికి దాన్ని హాస్సిటల్ అని పిలవాలనిపించదు. ఎక్కడికక్కడ పెరుకుపోయిన చెత్త.. రోడ్లపై నిలిచిపోయిన మురికి నీరు.. మనుషులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలో పందులు, పశువులు కూడా అక్కడే తిరుగుతున్నాయి. రోగులకు వైద్య సేవలతో పాటు ఈ జంతువులను తరమడం అక్కడ సిబ్బంది విధుల్లో భాగం అయ్యింది. బిహార్‌లోని పురాతన వైద్య కళాశాలలలో ఒకటైన దర్భంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో(డీఎంసీహెచ్) ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం అయ్యాయి. సమస్తిపూర్, మధుబని, సహర్సాతో సహా అనేక జిల్లాల ప్రజలు ఈ డీఎంసీహెచ్పై ఆధారపడతారు. కాని ఇక్కడ వైద్యం చేయించుకోవడం అంటే.. నరకంలో ప్రవేశించడమే అంటున్నారు స్థానికులు. అత్యవసర విధులు నిర్వహించే నర్సులు, డాక్టర్లు మురికి నీటి కాలువలను దాటుకుంటూ అక్కడకు చేరుకోవాలి. ఈ క్రమంలో దీపా కుమారి అనే నర్సు మాట్లాడుతూ.. ‘‘గత 27 సంవత్సరాలుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. వర్షాకాలంలో ఇది మరింత తీవ్రమవుతుంది’’ అని తెలిపారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రంట్‌లైన్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేయవలసి వస్తుంది. డీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ మణి భూషణ్ శర్మ కార్యాలయం కూడా ఈ చెత్త మధ్యనే ఉంది. ఆయన తన ఆఫీస్‌కు చేరుకోవాలంటే ఓ గార్డు, డ్రైవర్ సహాయం తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆస్పత్రి చాలా పాతది, లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇదే ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవనంలో కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్నాం. కానీ అక్కడకు చేరుకునే పరిసరాలు కూడా ఇలానే నీరు నిండిపోయి ఉంటాయి. సిబ్బంది చాలా తక్కువగా ఉండటం కూడా సమస్యే’’ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు మండిపడుతున్నారు. పన్నుల రూపంలో మా దగ్గర నుంచి లక్షల్లో దోచేస్తూ.. కనీస సౌకర్యాలు కల్పించని ఈ ప్రభుత్వాలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే -
ర్యాగింగ్ : విద్యార్థినులకు షాక్
సాక్షి, ధర్భంగా : గర్ల్స్ హాస్టల్లో జూనియర్ విద్యార్థినులపై ర్యాంగింగ్కు దిగిన సీనియర్ విద్యార్థినులపై దర్భంగా మెడికల్ కాలేజ్ తీవ్ర చర్యలు తీసుకుంది. ర్యాగింగ్‌లో పాల్గొన్న మొత్తం 54 విద్యార్థినులపై రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నవంబర్ 25 లోపు చెల్లించాలని, లేకపోతే ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని యాంటి ర్యాగింగ్ కమిటీ నోడల్ ఆఫీసర్ రాధారమణ్ ప్రసాద్ సింగ్ స్పష్టం చేశారు. కాలేజ్‌లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జారిమానా విధించవచ్చని ఆయన చెప్పారు. మొదటిసారి సాధారణ జరిమానా విధించామన్న ఆయన.. మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే పరిణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ నెల 11న కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు హాస్టల్లో ర్యాగింగ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. #Bihar: 54 students of girls hostel in Darbhanga Medical College fined Rs 25,000 each for allegedly ragging juniors pic.twitter.com/8Cm1Ce51bM — ANI (@ANI) 19 November 2017 -
ప్రసాదం తిన్న భక్తులు... పరిస్థితి విషమం
పాట్నా: దేవాలయంలో దేవుని ప్రసాదం తిని 95 మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సంఘటన బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని భద్రపూర్ బ్లాక్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎప్పటిలాగే స్థానిక దేవాలయంలో దేవుడ్ని భక్తులు సందర్శించుకున్నారు. అనంతరం భక్తులకు దేవాలయ ప్రతినిధులు ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రసాదం తిన్న భక్తులు వెంటనే కడుపులోనొప్పి అంటూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. దాంతో దేవాలయం యాజమాన్యం భక్తులను హుటాహుటిన దర్బంగా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 95 మందిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. భద్రపూర్ రాష్ట్ర రాజధాని పాట్నాకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనారోగ్యం పాలైన వారిలో మహిళలు, చిన్నారులు, వృద్దులు ఉన్నారని ఉన్నతాధికారి తెలిపారు.


