న్యాయవాద వృత్తిని వద్దని మెకానిక్‌ ఉద్యోగం..! వేతనం ఎంతంటే.. | US woman swaps law aspirations for a mechanic job at a ski resort | Sakshi
Sakshi News home page

న్యాయవాద వృత్తిని వద్దని మెకానిక్‌ ఉద్యోగం..! వేతనం ఎంతంటే..

Oct 19 2026 12:25 PM | Updated on Oct 19 2026 12:55 PM

US woman swaps law aspirations for a mechanic job at a ski resort

ఏఐ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు చాలా ఉద్యోగాలు కనుమరగయ్యాయి. నిరుద్యోగం తప్పదని అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం యువత సరికొత్తగా ఆలోచిస్తూ ఉపాధి మార్గం వెతుకుతున్నారు. అది చిన్నదా? పెద్దదా? కాదు మేటర్‌ పనిలో స్కిల్‌ ఎంత అన్నదే మేటర్‌ అని కరాఖండీగా చెప్పేస్తున్నారు. అదే మనకు ఎక్కువ వేతనం ఆర్జించేలా చేస్తుందని అంటున్నారు. అదే చేసింది ఈ అమెరికా యువతి. 

అమెరికాకు చెందిన 25 ఏళ్ల విక్టోరియా మాడెన్స్‌ న్యాయవాద వృత్తే లక్ష్యంగా యూటా వ్యాలీ యూనివర్సిటీలో చేరింది. మూడో సంవత్సరంలో సన్‌డాన్స్‌ మౌంటెన్‌ రిసార్ట్‌ కంపెనీలో మెకానిక్‌గా పనిచేసే అవకాశం లభించింది. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా..తామే శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని సన్‌డాన్స్‌ మౌంటెన్‌ రిసార్ట్‌ కంపెనీ చెప్పడంతో చేరిపోయింది మాడెన్స్‌. తన శిక్షణ ముగిసిన వెంటనే అక్కడే లిఫ్ట్‌ మెకానిక్‌గా కొనసాగే అవకాశం లభించింది. 

అయితే ఆమెకు అస్సలు మెకానిక్‌ నైపుణ్యాలు లేవని చెప్పినప్పటికీ.. ఆ కంపెనీ యజమానులు ట్రెయిన్‌ చేసి మరి ఉద్యోగం ఇస్తామనడంతోనే ఆ ఆఫర్‌ని కాదలేకపోయా కానీ అది తనకు మంచిదే అయ్యిందని అంటోంది. ప్రస్తుతం తాను తన స్నేహితుల కంటే ఎక్కువ ఆర్జిస్తున్నానని, గంటకు సుమారు రూ. 30 వేలపైనే ఆర్జిస్తున్నట్లు పేర్కొంది. చివరికి తాను గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యేటప్పటికి మరింత మొత్తంలో ఎక్కువ వేతనం ఆర్జించడంతో బ్లూకాలర్‌ జాబ్‌నే ఎంచుకున్నానని సగర్వంగా చెబుతోంది. 

తనను మెకానిక్‌గా పరిచయం చేసుకోవడానికి సిగ్గుపడనని కూడా అంటోందామె. అంతేగాదు ఈ లిఫ్ట్‌ మెకానిక్‌ జాబ్‌తో సొంతంగా అపార్ట్‌మెంట్‌, కారు కూడా కొనుక్కునేలా ఆర్థిక స్వేచ్ఛను పొందానంటోందామె. ఇటీవల యువతకు నైపుణ్యం గల వృత్తులపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో జరిపిన 'ఫ్యూచర్ ఆఫ్ ది స్కిల్డ్ ట్రేడ్స్ రిపోర్ట్ సర్వేలో మాడెన్స్‌ విషయం వెలుగులోకి వచ్చింది. 

కేవలం 16 నుంచి 30 ఏళ్ల వయసుగల యువతీ యువకులు..స్కిల్‌తో ముడిపడిన వృత్తిని కెరీర్‌గా ఎంచుకుని..దానిలోనే అపారమైన అనుభవాన్ని గడిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేగాదు చాలామంది కార్పొరేట్‌ ఉద్యోగాలకు దూరంగా వెళ్తున్నారని, ముఖ్యంగా వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు వెల్లడైంది. కాగా మాడెన్స్‌ మొదట్లో తానొక్కత్తే మహిళ అని ఇప్పుడు చాలామంది మహిళలు ఈ వృత్తిని చేపడుతున్నట్లు వెల్లడించింది. తాను మాత్రం తన ఉద్యోగం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది మాడెన్స్‌. 

ఇదీ చదవండి: నాన్నకు శిఖరమంత ప్రేమతో..! ఒక కుమార్తె స్ఫూర్తిదాయక జర్నీ..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement