నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు! | Shashi Tharoor swipe at centre over no Congratulations to Nobel Laureate Navi Pillay | Sakshi
Sakshi News home page

నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!

Oct 19 2026 12:37 PM | Updated on Oct 19 2026 12:58 PM

Shashi Tharoor swipe at centre over no Congratulations to Nobel Laureate Navi Pillay

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా న్యాయకోవిదురాలు నవనీతం ‘నవీ’ పిళ్ళై నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. తమిళనాడులోని దిండిగల్ మూలాలున్న ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడంతో బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విజయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభినందన సందేశం రాకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు.

భారత సంతతి మహిళ అంతర్జాతీయ గుర్తింపు పొంది ఆరు రోజులు గడుస్తున్నా కేంద్రం మౌనం వహించడం శోచనీయమని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నవీ పిళ్ళై.. నెల్సన్ మండేలా వంటి నాయకులకు న్యాయవాదిగా సేవలందించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా హైకోర్టులో తొలి శ్వేతజాతీయేతర మహిళా జడ్జిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. కాగా థరూర్ విమర్శలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ పూర్తిస్థాయిలో స్పందించనప్పుడు కేంద్రాన్ని మాత్రమే నిందించడం ద్వంద్వ నీతి అని కొందరు నెటిజన్లు థరూర్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement