కులమత భేదాలకు అతీతంగా మనుషులందరూ సమానమే అనే భావన సమాజానికి ఎప్పటికీ అవసరమే. మనుషుల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, మానవత్వం వంటి విలువలను ప్రోత్సహించిన మహనీయుల జీవితాలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయి. అలాంటి ఆధ్యాత్మిక తత్వవేత్త, సామాజిక సంస్కర్త రామానుజాచార్యుల జీవిత కథతో రూపొందిన చిత్రమే ‘జయహో రామానుజ’.

లయన్ డా. సాయి వెంకట్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ కథానాయికగా నటిస్తుండగా, సుమన్, ప్రవళ్లిక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం సిద్ధమవుతోంది.


