తెలుగు జానపద పాటలకు ఉండే ప్రత్యేకతే వేరు. వినసొంపైన పదాలు, చమత్కారమైన పోలికలు, గ్రామీణ యాసతో సాగే పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ‘గరివిడి లక్ష్మి’ సినిమాలోని ‘పికిలి పిట్టకు పీక సన్నము.. ఉర్ల భామకు ఉరకలందము.. ఆడదానికి అలకలందము’ అంటూ సాగే పాట కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే కొంతమందికి ఈ సాంగ్ అర్థంకాకపోవడంతో ఈ పాటలోని పదప్రయోగం, పోలికలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
పాటలోని పోలికల ప్రత్యేకత ఇదే!
ఈ పాటలో అమ్మాయి అందాన్ని ప్రకృతిలోని జీవులతో పోలుస్తూ చమత్కారంగా వర్ణించారు. పికిలి పిట్టకు సన్నని మెడ అందమైతే, ఉత్సాహంగా, చురుగ్గా ఉండే అమ్మాయిల కదలికలను మరో పోలికతో చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ‘ఆడదానికి అలకలందము’ అంటూ అమ్మాయిల అలకను కూడా అందమైన లక్షణంగా అభివర్ణించారు. సాధారణంగా కనిపించే విషయాలను సరదాగా, లయబద్ధమైన పదాలతో చెప్పడం ఈ పాటలోని ప్రత్యేకత. గ్రామీణ జీవితంలో వినిపించే మాటలు, స్థానిక యాసను గుర్తుచేసే పదాలు పాటకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి.
సోషల్ మీడియాలో ఎందుకింత ఆసక్తి?
జానపద పాటల్లో పదాల ఎంపిక, వాటి వెనుక దాగి ఉండే భావాలు శ్రోతలను ఆకట్టుకుంటుంటాయి. ఈ పాటలోని వినూత్నమైన పోలికలు కూడా అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్నాయి. పాడుకోవడానికి సులభంగా ఉండే పదాలు, చమత్కారమైన వర్ణన పాటకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. అయితే కొంతమందికి ఈ పాట అర్థం తెలియక నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
సినిమా విషయానికి వస్తే..
ఉత్తరాంధ్రలో బుర్రకథలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'గరివిడి లక్ష్మి '. పీపుల్స్ మీడియా నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆనంది కీలక పాత్రలో నటించారు. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు కీలక పాత్రలు చేశారు. 90స్ లో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మి జీవిత కథ ఈ సినిమా.
(ఇదీ చదవండి: జైలర్-2.. రజనీ మనవడికి రెమ్యునరేషన్ ఎంతంటే?)
Kudos to PMF for choosing the story of Garividi Lakshmi to bring her life to the big screen! 👏 The first half of #GarividiLakshmi impressed me with its authentic village atmosphere and Burra Katha songs. Looking forward to the second half! ❤️🎬 https://t.co/Gz0TP3UPjo
— Mohan Kumar (@ursmohan_kumar) October 12, 2026


