జైలర్‌-2.. రజనీ మనవడికి రెమ్యునరేషన్‌ ఎంతంటే? | Jailer2 Ritvik Remuneration for Rajinikanth Grandson | Sakshi
Sakshi News home page

Jailer2 Remunerations: ఈ 7 ఏళ్ల ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Oct 19 2026 3:45 PM | Updated on Oct 19 2026 3:51 PM

Jailer2 Ritvik Remuneration for Rajinikanth Grandson

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్‌-2’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబెడుతోంది. గతంలో విడుదలైన ‘జైలర్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.

రమ్యకృష్ణ, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, విజయ్‌ సేతుపతి, మిథున్‌ చక్రవర్తి, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో నటించారు. అయితే వీరితో పాటు ఏడేళ్ల రిత్విక్‌ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇందులో రజనీకాంత్‌ మనవడి పాత్రలో కనిపించిన అతడు తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

రిత్విక్‌ పారితోషికం ఎంతంటే?
ఈ నేపథ్యంలో జైలర్‌-2లో నటించినందుకు రిత్విక్‌ ఎంత పారితోషికం అందుకున్నాడనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం అతడికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అయితే అధికారికంగా ధ్రువీకరణ కాలేదు.

 కాగా రిత్విక్‌ గతంలోనూ పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘లక్కీ భాస్కర్‌’, నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ2’, కార్తీ నటించిన ‘సర్దార్‌’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు జైలర్‌-2తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

(ఇదీ చదవండి: రామ్‌ కొత్త సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ హీరో..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement