ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకటి రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్-2 కాగా.. విజయ్ దేవరకొడం రణబాలి రెండోది. ఈ రెండు పెద్ద సినిమాలు కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రిలీజయ్యాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న జైలర్-2 వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
మరోవైపు విజయ్ దేవవరకొండ-రష్మిక జంటగా వచ్చిన రణబాలి మాత్రం మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. జైలర్-2, రణబాలి చిత్రాల మధ్య ప్రధాన తేడా ఏంటనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఉన్న ప్లస్, మైనస్‌లు ఏంటేనేది ఆరా తీస్తున్నారు.
అదే ప్రధాన తేడా..
ఈ రెండు చిత్రాల కథ, కథనం పక్కనపెడితే ప్రధాన వ్యత్యాసం అదేనని అంటున్నారు. జైలర్-2 మూవీకి అనిరుధ్ రవిచందర్ బీజీఎం మరోస్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. మరోసారి తన టాలెంట్‌తో మ్యాజిక్ చేశారని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో అనిరుధ్ బీజీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే రణబాలి మూవీకి ఆ స్థాయిలో బీజీఎం లేకపోవడ పెద్ద మైనస్‌గా భావిస్తున్నారు. ఈ చిత్రంలో బలమైన కథాంశం, సన్నివేశాలు ఉన్నప్పటికీ థియేటర్లో ఆశించిన స్థాయి రాణించలేకపోయిందని అంటున్నారు. ముఖ్యంగా అజయ్-అతుల్ బీజీఎం తగిన స్థాయిలో వర్కవుట్ కాలేదని చెబుతున్నారు. బీజీఎం లోపం వల్లే కొన్ని సీన్స్‌కు హైప్ తీసుకురావడంలో తేలిపోయిందని అంటున్నారు. కథ, కథనం బాగానే ఉన్నప్పటికీ రణబాలిని బీజీఎం దెబ్బతీసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సినిమాలకు ఉన్న ప్రధాన తేడా అదేనని.. అందుకే జైలర్-2 దూసుకెళ్తంటే.. రణబాలి వెనకపడి పోయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాకు బీజీఎం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది.


