టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన | Did weapon malfunction save Tiger Shroff 2 live cartridges found 7 rounds fired | Sakshi
Sakshi News home page

టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన

Oct 19 2026 6:15 PM | Updated on Oct 19 2026 6:21 PM

Did weapon malfunction save Tiger Shroff 2 live cartridges found 7 rounds fired

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై  హత్యాయత్నం ఘటన దిగ్భ్రాంతి రేపింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఈ ఘటనకు పోలీసులు ప్రాథమిక వివరాలను వెల్లడించారు.  కాల్పుల ఘటనలో దుండగులు మొత్తం 7 రౌండ్లు కాల్పులు జరపగా, ఘటనా స్థలంలో రెండు పూర్తి కార్ట్రిడ్జ్‌లు (Full cartridges), 5 ఖాళీ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

అయితే  ఆయుధం సరిగ్గా  పోవడంవల్లే  ఆయనకు పెద్ద ప్రమాదం తప్పినట్టు  భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఒక దుండగుడు టైగర్ ష్రాఫ్ బీఎండబ్ల్యూ కారుపై వరుసగా కాల్పులు జరుపుతుండగా, నటుడు కూర్చున్న ప్యాసింజర్ వైపు ఉన్న రెండవ దుండగుడు తన తుపాకీని కాల్చడానికి ఇబ్బంది పడ్డాడు. అతను తుపాకీని రెండు చేతులతో మారుస్తూ కాల్చడానికి ప్రయత్నించినప్పటికీ షాట్ పేలలేదు. ఈ నేపథ్యంలో తుపాకీ జామ్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడిలో టర్కీలో తయారైన 'జిగానా' (Zigana) పిస్టల్‌ను ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్ట్రిడ్జ్‌లు 7.62 మి.మీ కాలిబర్‌కు చెందినవి. ఒక దుండగుడి తుపాకీలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పూర్తిగా ఉన్న కార్ట్రిడ్జ్ బయటపడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముంబై పోలీసుల సమాచారంతో రాజస్థాన్‌లోని కోటాలో రాజస్థాన్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్, కోటా సిటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో ఒక మైనర్‌ కూడా ఉన్నాడు. పుణె-జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో కోటా చేరుకున్న హర్యానాకు చెందిన 17 ఏళ్ల బాలుడు, రెహాన్, అలాగే బిహార్‌కు చెందిన హ్రితిక్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దు ప్రాంతానికి చెందిన ఒకరితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. 

ఇదీ చదవండి: టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!

కాగా  ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూలో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని కారులో వెళుతున్న 36 ఏళ్ల టైగర్ ష్రాఫ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆయన డ్రైవర్ ఫిర్దౌస్, ఆటో డ్రైవర్ చౌహాన్ గాయపడ్డారు.    ఈ దాడిని  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  తీవ్రంగా ఖండించారు.   బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హచ్చరించారు. అయితే ఈ కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తున్న వారికి గ్యాంగ్ నుండి హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి: నీటి బుడగ జీవితం గురించి బోధిస్తుండగానే ప్రాణం పోయింది!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement