అన్నా.. వాళ్లలా నన్ను సీఎంని చేస్తారా: శర్వానంద్‌ | Sharwanand About CM at BHOGI Musical Celebrations | Sakshi
Sakshi News home page

Sharwanand: అన్నా.. వాళ్లలా నన్ను సీఎంని చేస్తారా: శర్వానంద్‌

Nov 25 2026 2:58 PM | Updated on Nov 25 2026 3:07 PM

Sharwanand About CM at BHOGI Musical Celebrations

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ భోగి.  ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజికల్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హీరో శర్వానంద్ కూడా హాజరయ్యారు. ఈ వేదికపై శర్వానంద్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇప్పుడివి వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఈవెంట్‌లో సినిమా నుంచి గంగా థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. ఈ సందర్భంగా నర్సన్నను ఉద్దేశించి శర్వానంద్‌ మాట్లాడారు. ‘మీరు చాలా మందిని సీఎంలని చేశారు. అలా నన్ను కూడా చేసేస్తారా ఏంటి?. ఇప్పుడు నా ఈ సినిమాకు సాంగ్ పాడారు. ఏమో నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో అని సరదాగా అన్నారు. దీనికి బదులు ఇచ్చిన గద్దర్‌ నర్సన్న ‘ఏమో అన్నా.. అయినా అయిపోవచ్చు’ అని అన్నారు. 

(ఇదీ చదవండి: సాత్వికా.. నువ్వు బాగా ఏడుస్తావు..: నాని)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement