నన్ను కూడా సీఎంను చేస్తారా?.. హీరో శర్వానంద్ కామెంట్స్ | Sharwanand Comments at Bhogi Movie SOng launch Event | Sakshi
Sakshi News home page

Bhogi Movie: 'నన్ను కూడా సీఎం చేసేస్తారా?'.. హీరో శర్వానంద్

Nov 25 2026 11:33 AM | Updated on Nov 25 2026 11:33 AM

Sharwanand Comments at Bhogi Movie SOng launch Event

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ భోగి. ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా.. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి గంగా థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. ఈ సాంగ్‌ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు.  

(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మ్యూజికల్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హీరో శర్వానంద్ కూడా హాజరయ్యారు. ఈ వేదికపై శర్వానంద్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. సింగర్ నర్సన్నను ఉద్దేశించి సరదాగా మాట్లాడారు. మీరు చాలా మంది సీఎంలకు పాటలు పాడారు.. ఇప్పుడు నా ఈ సినిమాకు సాంగ్ పాడారు.. ఇప్పుడు నన్ను కూడా ముఖ్యమంత్రిని చేస్తారా? ఏమో నేను కూడా విజయ్‌లా సీఎం అవుతానేమో అని సరదాగా అన్నారు. తెలుగు తెరపై ఇలాంటి కథ వచ్చి దాదాపు ఇరవైయ్యేళ్లు అవుతుందన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement