నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1'మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ మూవీ తొలిభాగం ఈ దీపావళికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అక్టోటర్ 15న చిత్ర బృందం బెంగళూరులోని అంతర్జాతీయ టైలర్ విడుదల కార్యక్రమంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్ కన్నడ ప్రసంగం ప్రేక్షకులను ఆకట్టుకోగా, సాయి పల్లవి తన ట్రెడిషనల్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్లో సాయిపల్లవి ప్రత్యేకంగా కుట్టించుకున్న గులాబీ రంగు చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. వెండి జర్దోజీ వర్క్‌తో అలంకరించిన పట్టుచీరతో వైబ్స్ సృష్టించింది. చీర అంతటా వెండి బ్రోకేడ్ వృత్తాకార నమూనాలు ఉండగా, అంచు వెంబడి ఉన్న కట్‌వర్క్ చక్కటి భారతీయ హస్తకళకు నిదర్శనంగా నిలిచింది.
జాకెట్‌పై కూడా అదే కట్‌వర్క్ ఉంది. మోచేతుల వరకు పొడిగించబడి..క్లిష్టమైన జర్దోజీ వివరాలను హైలెట్ చేశాయి. అలాగే ఈ చీరకు అనుగుణంగా ఉంగరాల జుట్టుతో తేలికైన మేకప్ లుక్‌తో నేచురల్‌గా కనిపించింది. ఇక వేదికపై సాయిపల్లవి మాట్లాడుతూ.."మా అందరిపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఇక్కడకి వచ్చిన ప్రతిసారీ మీరందరూ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది.
ఇది మాకు కేవలం సినిమా కాదు, బాధ్యత. ఇందులో నాకు సీతమ్మ పాత్రను పోషించే అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞురాలిని. ఆమె గుణాల్లో కొన్నైనా అవర్చుకోగలిగా". అంటూ తన సంభాషణను ముగించింది. కాగా, ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్, సాయిపల్లవి, రవిదూబే, రకుల్ ప్రీత్ సింగ్, యశ్, దర్శకుడు నితేశ్ తివారీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.
Finally our sita maa @Sai_Pallavi92 joins the event of #ramayana with so much grace and just look at her 😭❤️ The wait is so worth it 🥹💗 #sitamaa #saipallavi #ramayana https://t.co/vKMWcxaiSn
— saipallavi.fp (@Saipallavi__) October 15, 2026
ఇదీ చదవండి: శతాబ్దాల నాటి కలంకారీ డిజైర్ వేర్లో రాధికా స్టన్నింగ్ లుక్..! కృష్ణ లీల, కల్పవృక్షం..


