breaking news
Pink Saree
-
గులాబీ చీరలో ‘సీతమ్మలా’ సాయిపల్లవి ట్రెడిషనల్ లుక్!
నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన భారీ పౌరాణిక చిత్రం 'రామాయణ: పార్ట్ 1'మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ మూవీ తొలిభాగం ఈ దీపావళికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అక్టోటర్ 15న చిత్ర బృందం బెంగళూరులోని అంతర్జాతీయ టైలర్ విడుదల కార్యక్రమంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రణబీర్ కపూర్ కన్నడ ప్రసంగం ప్రేక్షకులను ఆకట్టుకోగా, సాయి పల్లవి తన ట్రెడిషనల్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్లో సాయిపల్లవి ప్రత్యేకంగా కుట్టించుకున్న గులాబీ రంగు చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. వెండి జర్దోజీ వర్క్‌తో అలంకరించిన పట్టుచీరతో వైబ్స్ సృష్టించింది. చీర అంతటా వెండి బ్రోకేడ్ వృత్తాకార నమూనాలు ఉండగా, అంచు వెంబడి ఉన్న కట్‌వర్క్ చక్కటి భారతీయ హస్తకళకు నిదర్శనంగా నిలిచింది. జాకెట్‌పై కూడా అదే కట్‌వర్క్ ఉంది. మోచేతుల వరకు పొడిగించబడి..క్లిష్టమైన జర్దోజీ వివరాలను హైలెట్ చేశాయి. అలాగే ఈ చీరకు అనుగుణంగా ఉంగరాల జుట్టుతో తేలికైన మేకప్ లుక్‌తో నేచురల్‌గా కనిపించింది. ఇక వేదికపై సాయిపల్లవి మాట్లాడుతూ.."మా అందరిపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఇక్కడకి వచ్చిన ప్రతిసారీ మీరందరూ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇది మాకు కేవలం సినిమా కాదు, బాధ్యత. ఇందులో నాకు సీతమ్మ పాత్రను పోషించే అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞురాలిని. ఆమె గుణాల్లో కొన్నైనా అవర్చుకోగలిగా". అంటూ తన సంభాషణను ముగించింది. కాగా, ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్, సాయిపల్లవి, రవిదూబే, రకుల్ ప్రీత్ సింగ్, యశ్, దర్శకుడు నితేశ్ తివారీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.Finally our sita maa @Sai_Pallavi92 joins the event of #ramayana with so much grace and just look at her 😭❤️ The wait is so worth it 🥹💗 #sitamaa #saipallavi #ramayana https://t.co/vKMWcxaiSn— saipallavi.fp (@Saipallavi__) October 15, 2026 ఇదీ చదవండి: శతాబ్దాల నాటి కలంకారీ డిజైర్ వేర్లో రాధికా స్టన్నింగ్ లుక్..! కృష్ణ లీల, కల్పవృక్షం.. -
అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాల నుంచి బాలీవుడ్ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్ లుక్‌లో కనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్‌వర్క్ రోసెట్ బోర్డర్. జ్యువెల్డ్ టాసెల్స్‌తో డెకరేట్ చేసిన హాట్పింక్ సిల్క్ బ్లౌజ్‌తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అత్యంత హైలెట్‌గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్ ఎంబెడెడ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్‌ని మరింత హైలెట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్ కూడా చాలా నేచురల్‌గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నిషి సింగ్. సచిన్ సైతం ఆ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్‌ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah)ఇక అంజలీ కూడా మేకప్ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్ లైట్ మేకప్‌నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్ క్రీమ్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ దుస్తులను మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..) -
మనీష్ మల్హోత్రా పింక్ గోల్డ్ డ్రెస్: ‘ఉమ్రావ్ జాన్’ రేఖ మేజిక్ రిపీట్
-
విశాఖపట్నం బీచ్‌రోడ్డులో పింక్ శారీ వాక్ సినీనటి గౌతమి సందడి (ఫొటోలు)
-
వారసుడిని రెడీ చేస్తున్న సింగర్ శ్రేయా ఘోషల్ (ఫొటోలు)
-
పారిపోయి మరీ కోర్టులో పెళ్లి : ‘కలగా ఉంది నమ్మలేకపోతున్నాం’ (ఫోటోలు)
-
గులాబీ రంగు చీరలో అందాల ‘రాశీ’ ఖన్నా (ఫొటోలు)


