ఒకే చీర.. ఎన్నో స్టైల్స్‌.. ఒక్కో కట్టులో ఒక్కో ప్రత్యేకత! | Saree Draping Women Fashion Trends | Sakshi
Sakshi News home page

ఒకే చీర.. ఎన్నో స్టైల్స్‌.. ఒక్కో కట్టులో ఒక్కో ప్రత్యేకత!

Nov 28 2026 11:36 AM | Updated on Nov 28 2026 11:36 AM

Saree Draping Women Fashion Trends

ఆరు గజాల చీర.. ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింపజేయడమే కాదు.. వారి అభిరుచికి, ఆలోచనలకు, మనసులోని భావాలకు అద్దం పడుతుంది. ఒకే చీరను ఒక్కొక్కరు ఒక్కోలా కడితే కనిపించే రూపమే వేరు. కొందరిలో సంప్రదాయపు అందం కనిపిస్తే.. మరికొందరిలో ఆధునికత ఉట్టిపడుతుంది. ఇంకొందరు తమదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటారు.

ఇలా చీరకట్టులో కనిపించే చిన్న చిన్న మార్పుల వెనుక ఫ్యాషన్‌  మాత్రమే కాదు.. వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆ రోజు మానసిక స్థితి కూడా దాగి ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనకు నచ్చిన దుస్తులు ధరించినప్పుడు మనసులో తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనల్ని మనం కొత్తగా చూసుకున్న అనుభూతి కలుగుతుంది.

ముఖ్యంగా చీరకట్టులో చేసే చిన్న మార్పు కూడా మన రూపంతో ΄ాటు మన మూడ్‌ను మార్చగలదు. కొన్నిసార్లు మనసు సంప్రదాయాన్ని కోరుకుంటే సంప్రదాయ శైలిలో చీర కట్టుకుంటాం. మరికొన్ని సందర్భాల్లో కొత్తగా కనిపించాలనిపిస్తే ఆధునిక పద్ధతులను ఎంచుకుంటాం. అంటే చీరకట్టు అనేది ఇతరుల మెప్పు కోసం చేసే అలంకరణ మాత్రమే కాదు.. మనకు మనం ఇచ్చుకునే ఓ చిన్న ఆనందం కూడా.

చీరకట్టులో ఎన్నో ప్రత్యేక శైలులున్నాయి. నేరుగా కొంగు వేసుకునే నీవి పద్ధతి, ముందు వైపు కొంగు వచ్చే గుజరాతీ శైలి.. ఇలా ఒక్కో విధానం ఒక్కో అందాన్ని తీసుకొస్తుంది. కొందరు ఎప్పుడూ సంప్రదాయ పద్ధతినే ఇష్టపడతారు. మరికొందరు కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంకొందరు ఒక ప్రత్యేకమైన చీరకట్టు శైలినే తమ గుర్తింపుగా మార్చుకుంటారు. ఈ ఎంపికల్లో వారి అభిరుచి, సౌకర్యం, ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తాయి.

అందుకే ఆరు గజాల చీరను కేవలం ఒక వస్త్రంగా చూడలేం. అది ఒక్కో సందర్భంలో ఒక్కో భావాన్ని పలికించే అందమైన అనుభూతి. చీర మారకపోయినా కట్టే తీరు మారుతుంది.. ఆ మార్పుతో రూపం మారుతుంది.. ఆ రూపంలోనే మనసులోని ఎన్నో భావాలు ప్రతిబింబిస్తాయి.

ఇదీ చదవండి: దగ్గరవుతారు... దూరమవుతారు... Gen-Z ప్రేమ ధోరణి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement