సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
అయితే ఇప్పుడీ సినిమా పైరసీ బారీన పడింది. విడుదలైన రెండో రోజే హెచ్డీ క్వాలిటీతో ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. దీంతో మూవీ మేకర్స్‌తో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. మిథున్ చక్రవర్తి, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం కావడంతో బాక్సాఫీస్‌లో భారీ వసూళ్లు రాబెడుతోంది.
(ఇదీ చదవండి: ‘జైలర్2’ ఓటీటీ డేట్ ఫిక్స్? స్ట్రీమింగ్ ఎక్కడంటే?)


