మెగా, నందమూరి మల్టీస్టారర్.. దర్శకుడిగా బోయపాటి రెడీ! | Director Boyapati Srinu Gives Interesting Updates On Akhanda 3 and Chiranjeevi Balakrishna Multistarrer | Sakshi
Sakshi News home page

Chiranjeevi Balakrishna Movie : ‘అఖండ 3’పై బోయపాటి క్లారిటీ..

Oct 5 2026 9:07 PM | Updated on Oct 5 2026 9:12 PM

Director Boyapati Srinu Gives Interesting Updates On Akhanda 3 and Chiranjeevi Balakrishna Multistarrer

మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను. తనదైన మాస్‌ టేకింగ్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న ఓ క్రేజీ మల్టీస్టారర్‌ కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరు-బాలయ్యతో  సినిమా..
చిరంజీవి, బాలకృష్ణ విషయంపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. ‘అవకాశం వస్తే మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ ఊరమాస్‌ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు.  దీంతో పాటు ‘అఖండ’ ఫ్రాంచైజీపై కూడా బోయపాటి కీలక ప్రకటన చేశారు. ‘అఖండ 3’ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి వేదికపై అధికారికంగా వెల్లడిస్తానని తెలిపారు. దీంతో బాలయ్య అభిమానుల్లో ‘అఖండ 3’పై అంచనాలు మరింత పెరిగాయి.

 (ఇదీ చదవండి: చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement