నాని 'ప్యారడైజ్' సినిమా.. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ ఎఫెక్ట్.. నానితో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద పడిందని.. దీంతో ఈ డైరెక్టర్ చిరంజీవితో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. వీటిపై నాని ఇప్పుడు స్పందించాడు. 'ప్యారడైజ్' రిలీజ్ తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
(ఇదీ చదవండి: 'కోర్ట్' శ్రీదేవి తమిళ ప్రేమకథ.. లవ్లీగా ట్రైలర్)
‘ది ప్యారడైజ్’ అండర్‌ఫెర్ఫార్మ్ చేయడానికి కొన్ని లాజిస్టిక్ సమస్యలు కూడా కారణమే. సినిమాని ఇంకా మెరుగ్గా తీసుండాల్సింది. ఫలితం సంగతి పక్కనబెడితే శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే శ్రీకాంత్ దగ్గర చాలా స్ట్రాంగ్ ఐడియాస్ ఉన్నాయి. అతడి ప్రతిభపై నాకు ఎంతో నమ్మకముంది. ‘ది ప్యారడైజ్’ తర్వాత శ్రీకాంత్ మరింత బలంగా తిరిగొస్తాడు' అని నాని చెప్పుకొచ్చాడు.
లెక్క ప్రకారం 'ప్యారడైజ్' తర్వాత శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో ఓ సినిమా చేయాలి. దీనికి నానినే నిర్మాత. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందని రూమర్స్‌పై స్పందించిన నాని.. 'ది ప్యారడైజ్ ఆలస్యం కావడంతో చిరంజీవి తన ఇతర ప్రాజెక్టులు, కమిట్‌మెంట్స్‌తో ముందుకు వెళ్లారు. ప్యారడైజ్ తర్వాత నేను ఇప్పటివరకు చిరంజీవి సర్‌ని కలవలేదు. మేమిద్దరం కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ సినిమాపై మరింత క్లారిటీ వస్తుంది' అని చెప్పాడు.
‘ది ప్యారడైజ్’ నిర్మాణంలో ఎదురైన అనుభవాల నుంచి ఓ ముఖ్యమైన విషయం నేర్చుకున్నామని నాని చెప్పాడు. సినిమా మూడేళ్లు పట్టినా, ఐదేళ్లు పట్టినా ఆ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకోవాలి తప్పితే షూటింగ్ దశలో టైం వేస్ట్ చేసుకోకూదని పేర్కొన్నాడు. తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడిన నాని.. సుజీత్ తో చేస్తున్న 'బ్లడీ రోమియో' తెలుగులో ఇప్పటివరకు రానటువంటి ఫ్రెష్‌గా ఉంటుందని, తర్వాత ఓ మంచి ఫ్యామిలీ మూవీ చేస్తానని నాని క్లారిటీ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అడ్డంగా బుక్కైన అగ్నిపరీక్ష బ్యాచ్.. ఇంకో వికెట్ పక్కా)


