'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన శ్రీదేవి.. తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీనే 'హైకూ'. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ కథతో తీశారు. యువరాజ్ చిన్నస్వామి దర్శకుడు. ఏగన్ హీరో కాగా శ్రీదేవితో పాటు మలయాళ నటి ఫెమినా జార్జ్ హీరోయిన్లుగా నటించారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందిన హైకూ.. ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.
19 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఒక యువకుడి జీవితంలో సాగే సంఘటనలే ఈ చిత్రకథ అని నిర్మాత చెప్పారు. ఒక ఉమెన్స్ కాలేజీలో ఒకే ఒక్క యువకుడు చేరితే.. తర్వాత ఏం జరిగింది? అక్కడే హీరోయిన్‌తో ఎలా ప్రేమలో పడ్డాడనేది మిగతా స్టోరీ. ట్రైలర్ అయితే చూసేందుకు ప్లెజెంట్‌గా బాగుంది. మరి మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి?


