విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం-ఏకే47’. ఈ మూవీ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన తొలిరోజే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలో వెంకీ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది.
అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై తాజా అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రం నవంబర్ 27 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
(ఇది చదవండి: సమంతకు రామ్ చరణ్ స్పెషల్ విషెస్)
ఏకే47 కథేంటంటే..
చిట్టిబాబు(వెంకటేశ్) ప్రైవేటు ఎంప్లాయ్. భార్య స్వర్ణ(శ్రీనిధి శెట్టి) చిట్టీల వ్యాపారం పేరుతో అప్పులు చేస్తూ ఉంటుంది. అప్పు కట్టలేక ఇంటి నుంచి బయటకి రాదు. కాలేజీ చదువుతున్న కూతురు సంపూర్ణ (యువీనా) .. బైక్ మెకానిక్...ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళతో ప్రేమలో పడుతూ..నాన్నకి తల నొప్పి తెప్పిస్తుంది. మరోవైపు కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్)కు చదువు రాదు. గుండె సమస్యతో బాధ పడుతూ ఉంటాడు. ఆపరేషన్ కి రూ. 2 లక్షలు అవుతుంది అని డాక్టర్లు చెబుతారు.
ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిట్టి బాబుకు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. అప్పులను ఎలా తీర్చాలి? అని బాధపడుతున్న సమయంలో రూ. 100 కోట్ల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు చేతికి రాకముందుకే చిట్టిబాబు ఫ్యామిలీ ఒక విల్లాకు షిఫ్ట్ అవుతుంది. రూ.వందకోట్లు వచ్చాయనే సంగతి తెలిసి హత్యలు చేసి ఉన్న డబ్బంతా తీసుకెళ్ళే బీహార్ గ్యాంగ్ చిట్టిబాబు ఇంటిని టార్గెట్ చేస్తుంది. కారు డ్రైవర్ గా, పని మనిషిగా చేరి డబ్బులు ఇంటిని వచ్చిన రాత్రి ఎటాక్ చేస్తారు. బిహార్ గ్యాంగ్ మంచి ఫ్యామిలీని కాపాడుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? అసలు అతని గతమేంటి? రూ.100 కోట్ల లాటరీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటి? చిట్టి బాబు ఇంటిపై దాడికి వచ్చిన బిహారీ గ్యాంగ్ కనిపించకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఎస్పీ (నారా రోహిత్) ఈ కేసును ఎలా డీల్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
📢 OFFICIAL ANNOUNCEMENT LOADING 💥 #AdarshaKutumbam (Telugu) Streaming from November 27 on Netflix in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi 🍿!! #OTT_Trackers https://t.co/1YSi8l3SLK
— OTT Trackers (@OTT_Trackers) November 22, 2026


