breaking news
haiku
-
'హైకూ' సినిమా రివ్యూ
'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి హీరోయిన్గా చేసిన తమిళ సినిమా 'హైకూ'. తెలుగులోనూ ఇది థియేటర్లలో రిలీజైంది. లేడీస్ కాలేజీలో అబ్బాయి ఒక్కడే ఉండటం అనే విభిన్నమైన కాన్సెప్ట్ మూవీపై ఆసక్తి రేపింది. ఇందుకు తగినట్టుగానే విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచడంలో సఫలమయ్యాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)కథేంటి?కాలేజీ నుంచి సస్పెండ్ అయిన మనోహర్ (ఏగన్).. సిటీలోని వేరే కాలేజీల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో.. లేడీస్ నుంచి కో ఎడ్యుకేషన్‌గా మారిన కాలేజీలో సీటు దొరుకుతుంది. అక్కడ పవళకుడి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. కాలేజీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వెళతాడు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వల్ల మనో-కుడి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? వాళ్ళిద్దరూ విడిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? కుడి మరో పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటి? చెన్నైలో ఇంటర్న్‌గా పనిచేసే నివేదా(ఫెమినా జార్జ్)తో మనో ప్రేమ, సహజీవనంలో ఏం జరిగింది? మనోకి దూరం కావాలని నివి ఎందుకు నిర్ణయించుకుంది? చివరికి కుడిని కలిశాక మనో ఏం తెలుసుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?లేడీస్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో అబ్బాయి ఒక్కడే అనే పాయింట్‌తో సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించారు. సాధారణంగా చిత్రాల్లో అమ్మాయిలని అబ్బాయిలు ర్యాగింగ్ చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అబ్బాయిని అమ్మాయిలు ర్యాగ్ చేసే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. అమ్మాయిల మధ్యలో హీరో పడే ఇబ్బందులు నవ్విస్తాయి. హీరోకి హీరోయిన్ రాఖీ కట్టడం, వారి పరిచయ సన్నివేశాలు బాగున్నాయి. ప్రేమలో పడిన తర్వాత వచ్చే కులం పట్టింపులు లాంటివి రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ టైంపాస్ చేయించారు. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంచారు. ఉద్యోగంలో చేరిన తర్వాత హీరో ప్రేమలో పడతాడని ముందే అర్థమవుతుంది. అయితే నివేదాతో ప్రేమలో పడిన తర్వాత వచ్చే కాన్ఫ్లిక్ట్ కొత్తగా ఉంది.మనసులో వేరొకరి జ్ఞాపకాలను ఉంచుకుని, తనపై చూపించే ప్రేమ వద్దనుకునే అమ్మాయి నివి కథే ఈ సినిమా అసలు ఆత్మ. బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమలో పడే కాన్సెప్ట్‌తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ‘హైకూ’ ప్రత్యేకత ఏమిటంటే... బ్రేకప్ తర్వాత గతంలో ప్రేమించిన అమ్మాయిని గుర్తుపెట్టుకుని, ఆ రిలేషన్లో చేసిన తప్పులు తన దగ్గర రిపీట్ చేయకూడదని అనుకోవడాన్ని నివి సహించలేకపోతుంది. వేరొకరి నీడలో ఉండే ప్రేమ తనకు వద్దని అంటుంది. ఈ అంశాన్ని తెరపై ఎమోషనల్‌గా సరిగా చూపించలేకపోయారు. కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపిస్తాయి.నటీనటుల విషయానికి వస్తే.. హీరోగా ఏగన్ కాలేజీలో అమ్మాయిల మధ్య ఇబ్బంది పడే సన్నివేశాలలో ఈజీగా నటించాడు. ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త పరిణతి చెందాలి. ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయారు. ఫెమినా జార్జ్ గ్లామర్ పరంగానే కాకుండా చక్కటి నటనతో ఆకట్టుకుంది. మిగిలిన ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం పర్లేదనిపించగా సిద్ధూ కుమార్ సంగీతం కథకు తగ్గట్లు ఉంది. పీయూష్ గురుసామి కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.ఈతరం యువత, ముఖ్యంగా 'జెన్-జీ' జనరేషన్‌కు ప్రేమలో చేసే పొరపాట్ల గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే ‘హైకూ’. వినోదంతో పాటు సందేశం బాగున్నప్పటికీ, ఎమోషన్స్‌ని మరింత హార్ట్ టచింగ్‌గా తెరకెక్కించి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ)) -
‘హైకూ’ మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్
ఏగన్, 'కోర్ట్' శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకుడు. వచ్చే శుక్రవారం(అక్టోబర్ 23) మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ హజరయయ్యారు. మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఈ సినిమా నా హార్ట్‌కి చాలా కనెక్ట్ అయింది. లవ్‌లో ఉన్నా, రిలేషన్షిప్లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని అన్నారు.కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘హైకూ అక్టోబర్ 23 వస్తోంది. ఈ కథ అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ లోని బ్యూటిఫుల్ థింగ్స్ చూపించారు. మనల్ని మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్‌గా ఈ సినిమా శ్రీదేవి కోసం చూడాలి అని అన్నారు. -
'కోర్ట్' శ్రీదేవి తమిళ ప్రేమకథ.. లవ్లీగా ట్రైలర్
'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన శ్రీదేవి.. తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీనే 'హైకూ'. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కథతో తీశారు. యువరాజ్ చిన్నస్వామి దర్శకుడు. ఏగన్ హీరో కాగా శ్రీదేవితో పాటు మలయాళ నటి ఫెమినా జార్జ్ హీరోయిన్లుగా నటించారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందిన హైకూ.. ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.19 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఒక యువకుడి జీవితంలో సాగే సంఘటనలే ఈ చిత్రకథ అని నిర్మాత చెప్పారు. ఒక ఉమెన్స్ కాలేజీలో ఒకే ఒక్క యువకుడు చేరితే.. తర్వాత ఏం జరిగింది? అక్కడే హీరోయిన్‌తో ఎలా ప్రేమలో పడ్డాడనేది మిగతా స్టోరీ. ట్రైలర్ అయితే చూసేందుకు ప్లెజెంట్‌గా బాగుంది. మరి మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి? -
'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ లవ్ స్టోరీ
'కోర్ట్' సినిమాతో సక్సెస్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. ఆ వెంటనే 'బ్యాండు మేళం' అనే మూవీ చేసింది. ఇది అస్సలు వర్కౌట్ కాలేదు. అయితే 'కోర్ట్' హిట్ అయ్యేసరికి ఈమెకు తమిళంలో అవకాశం వచ్చింది. అలా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసింది. ఆ చిత్రమే 'హైకూ'. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ప్రకటించారు.ఏగన్ హీరోగా చేసిన ఈ సినిమాలో శ్రీదేవితో పాటు మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ హీరోయిన్గా చేసింది. యువరాజ్ చిన్నస్వామి దర్శకుడు. సిద్దు కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి వచ్చే నెల 23న మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. -
హైకూ ఆరంభం
ఏగన్ హీరోగా ఫెమీనా జార్జ్, తెలుగు మూవీ ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పల్ల హీరోయిన్లుగా ‘హైకూ’ అనే చిత్రం ఆరంభం అయింది. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, అనంతరం షూటింగ్ కూడా మొదలుపెట్టారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా. డి. అరుళనందు, మ్యాథ్యూ అరుళ నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.‘జో’ వంటి సూపర్ హిట్ మూవీతో గుర్తింపు పొందిన హరిహరన్ రామ్ అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘‘సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాం. కానీ మా సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా మా సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
తెలుగు హైకు: ఒక అవలోకనం
అభిప్రాయం హైకు అనే కవితా ప్రక్రియ జపాన్ దేశంలో రూపొంది ఇంగ్లిష్తో పాటు పలు ఇతర భాషల్లోకీ, మన తెలుగులోకీ వచ్చింది. ఇంగ్లిష్తో సహా ఐరోపా భాషల కవితలు వ్యర్థ పదాలతోనూ, పెద్దవిగా సాగిపోయే తీరులోనూ ఉండటానికి భిన్నంగా క్లుప్తతను గుణంగా కలిగి రూపొందిన కవితా ప్రక్రియ హైకు. నొగుచి అనే జపాన్ కవి అంటారు: ‘‘గంపల కొద్దీ రాసి అచ్చెయ్యాలి అన్న ఒకే ఉత్సుకతతో ఎప్పుడూ తపించే వాడు కవి అవడు’’. ‘‘క్లుప్తంగా చెప్పి బోధ పరచడం హైకు వైశిష్ట్యం’’ అంటూ నొగుచి ఒక ఉదంతాన్ని ఉటంకిస్తారు. హŸకషి అనే కవి తన గురువుకు సొంత ఇల్లు కాలిపోయిన సంగతిని ఓ హైకుగా రాసి తెలియజేస్తారు ఇలా: ‘నిప్పు రాజుకుంది– రాలే పువ్వు ప్రశాంతత ఎంతో!’ ‘ఇల్లు తగలబడింది కానీ తన మనసు ప్రశాంతతను కోల్పోలేదు’ అని హŸకషి తన హైకుతో తెలియ జేశారు. ఇంకా నొగుచి ఇలా అంటారు: ‘‘ఆకాశ నక్షత్రం, ఏకాంతం, మౌనం, పువ్వుల భాష వీటితో కలిసిపోయి బ్రతికేవాడే కవి’’. నొగుచి మోడర్న్ రివ్యూ అనే కలకత్తా పత్రికలో రాసిన వ్యాసాన్ని తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1916లో తమిళంలోకి అనువదించారు. హైకు ప్రాముఖ్యతను గురించి రవీంద్రనాథ్ టాగూర్ ఓ మంచి వ్యాసం రాశారు. దాన్ని గాలి నాసరరెడ్డి తెలుగులో అనువదించి 8–12–2008న ‘సాక్షి’లో ప్రకటించారు. హైకు, విశ్వ కవితా రూపాలలో ఓ విప్లవం. జపాన్ భాషలో హైకుకు ఆదికవి బషో (1644–94). హైకు కవిగా ఆయన స్థానం అద్వితీయం. ‘పాత కొలను, కప్ప లోపలికి దూకింది – నీళ్ల చప్పుడు.’ ఇది బషో రాసిన ఓ హైకు. బషో తరువాత బుసోన్, చిఝె, హŸకషి, హిస, ఇస్స, కికకు, షికి ప్రభృతులు జపనీస్ హైకును పరిపుష్టం చేశారు. జపాన్ మతాలు బౌద్ధం, టాఔ ఇజం, ఎనిమిజం జపాన్ హైకులలో మిళితం అయినాయి. తంక అనే ఓ కవితా ప్రక్రియ నుండి విడివడి హŸకుగా కొంతకాలం ఉండి చివరికి హైకుగా స్థిరపడింది. తంకలోని మొదటి భాగం హైకు. జపనీస్‌లో అజ్జాత కవుల హైకులు కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి: ‘కొత్త తండ్రి, జోల పాడాడు– అపశ్రుతిలో’. హైకు అన్న పదంలో ‘హై’ అంటే వినోదకర అనీ, ‘కు’ అంటే కవిత అనీ అర్థాలు. ఇక్కడ కు– హ్రస్వమే. ఈ హై, ఈ కు– రెండూ చైనీస్ –బై–కియు– నుంచి వచ్చాయి. తెలుగులో మనం హైకులు అనొచ్చు. హైకు జపనీస్‌లో 5, 7, 5 జిఒన్(jion)లతో రాయబడుతుంది. హైకు 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఇంగ్లిష్‌లోకి వెళ్లింది. ఇమేజిజం అనే ఎజ్రాపౌండ్ ఉద్యమం ద్వారా హైకు ఇంగ్లిష్‌లోకి వ్యాపించింది. ఎజ్రాపౌండ్తో పాటు ఎమిలో వెన్, ఫ్లింట్, జాన్ ఫ్లెచర్ వంటి కవులు హైకును ఇంగ్లిష్ లోకి తెచ్చారు. రాబర్ట్ ఫ్రాస్ట్, డబ్ల్యూ బి. ఈట్స్, వాలెస్ స్టీవెన్స్ వంటి కవులపై హైకు ప్రభావం పడింది. హెరాల్డ్ జి.హెన్డర్సన్ హైకుపై ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ప్రక్రియ పరంగా జపనీస్ జిఒన్లను ఇంగ్లిష్‌లో 5,7,5 సిలబల్స్గా తీసుకున్నారు. అది తప్పు. జపనీస్ హైకు ఒకే పాదంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో హైకును మూడు పాదాలుగా రాస్తారు. అదీ తప్పే. ఇంగ్లిష్‌లో హైకు అన్న పదం బహువచనాన్నీ సూచిస్తుంది. ఇంగ్లిష్ ద్వారా వ్యాపించడం వల్ల హైకు తన రూపాన్నీ, ఆత్మనూ కోల్పోయింది. ఈ నిజాన్ని ఇంగ్లిష్ పరిశీలకులే గ్రహించి ప్రకటించారు. తెలుగులో 1923లో దువ్వూరి రామిరెడ్డి మర్మ కవిత్వం అన్న తమ వ్యాసంలో బషో హైకులను హŸక్కులు అన్న శీర్షికతో తెలుగులోకి అనువదించి హైకులను తెలుగుకు పరిచయం చేశారు. ఆయన పద్యాలలో అనువదించారు. తరువాత కట్టమంచి రామలింగారెడ్డి 1931లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘గాథా సప్తశతి’ అనువాదానికి రాసిన పీఠికలో కొన్ని జపనీస్ హైకులను తేటగీతి ఛందస్సులో రెండు పాదాలుగా అనువదించారు. ఆ తరువాత 1950లో సంజీవదేవ్ కొన్ని హైకులను వచన కవితలుగా అనువదించారు. తొలి తెలుగు హైకు రాసినది గాలి నాసర రెడ్డి. 1990లో ఆంధ్రభూమి దినపత్రికలో ఆయన రాసిన 5 హైకులు అచ్చయినాయి. తొలి తెలుగు హైకు: నదిలో ఈత/ చంద్రుడి శకలాలు/ గుచ్చుకున్నాయి. మూడు పాదాల్లో 5, 7, 5 అక్షరాలతో ఆ 5 హైకులు ఉన్నాయి. 1991లో పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో తొలి తెలుగు హైకుల సంకలనాన్ని వెలువరించారు. ఇస్మాయిల్, బి.వి.వి.ప్రసాద్, లలితానంద ప్రసాద్, డా. శిరీష, మాకినీడి సూర్యభాస్కర్, అద్దేపల్లి రామమోహన రావు ప్రభృతులు తమ హైకులను, హైకులపై రచనలను వెలువరించారు. తొలి తెలుగు హైకు కవయిత్రి రత్నమాల. తెలుగులో హైకు పేరుతో ఎక్కువ రచనలు చేసినవారు పృథ్వీరాజ్. ఇంకా కొంతమంది కవులు, కవయిత్రులు హైకులు రాశారు. హైకు పత్రికలు కూడా వచ్చాయి. మొదట్లో తెలుగు హైకులు 5,7,5 అక్షరాలతో మూడు పాదాలలో రాయబడినా రానురాను ఆ నియమం సడలిపోయింది. 1950లోనే సంజీవ దేవ్ జపనీస్ జిఒన్లకు మన భాషలోని మాత్రలు ప్రత్యామ్నాయం అని సూచించారు. 2003లో ఉప్పలధడియం వెంకటేశ్వర తొలిసారి 5,7,5 మాత్రలతో మూడు పాదాలలో హైకు రాశారు. అది: ‘విత్తనం, నేల త్రోవను–చిరయాత్ర’. పెన్నా శివరామకృష్ణ ‘దేశదేశాల హైకు’ పేరుతో కొన్ని విదేశీ హైకులను తెలుగులోకి అనువదించారు. గాలి నాసరరెడ్డి కొన్ని విదేశీ హైకులని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. ముండకోపనిషత్(3–1–1) లోనే హైకు శిల్పం ఉందని చెబుతూ నాసర రెడ్డి ఓ శ్లోకాన్ని సూచించారు. అది: ‘‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్యః పిప్ఫలం స్వాద్వత్త్వ నశ్నన్నన్న్యో అభిచాక శీతి’’ ఒక దానితో ఒకటి కలిసి ఉన్న రెండు పక్షులు చెట్టుపై– ఒకటి చెట్టు ఫలాలను ఆస్వాదిస్తూ తింటోంది; మరొకటి తినకుండా చూస్తోంది. హైకు అన్నది శిల్పాత్మకమైన ఓ ప్రక్రియ. హైకు శిల్పంలో ఋతువుల్ని సూచించే పదాలు, చిత్రణలు, ఘటనలు, రెండు చిత్రణల కలయిక, రెండు ఘటనల కలయిక, చిత్రణ, ఘటన కలయిక అన్నవి ముఖ్యం. హైకు అన్నది నిర్వచనంలా ఉండదు. వివరణలా ఉండదు. హైకులో ఉపమ, రూపకం లాంటి అలంకారాలు ఉండవు. హైకుపై సరైన అవగాహన కావాలంటే జపనీస్ హైకులనే చదవాలి. హైకు 5,7,5 మాత్రలతో ఒకే పాదంలో ఉండటం శాస్త్రీయమైన పద్ధతి. ఆ పద్ధతిలో సిసలైన హైకు శిల్పంతో హైకు, హైకుగా తెలుగులో పునర్భవం పొందాల్సిన అవసరం ఉంది. రోచిష్మాన్ 09444012279 -
హైకూ టైటిల్ మారింది
సూర్య అతిథి పాత్రలో నటిస్తూ 2డీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం హైకూ. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా కవిన్, నయన,అభిమాన్ తదితర నవ నటీనటులు ముఖ్య పాత్రలు పరిచయం అవుతున్నారు. బాలల ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడీ చిత్ర పేరు మారనుంది. హైకూ అనేది ఆంగ్లం పేరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు చిత్రం అర్హత లేని కారణంగా పసంగ-2గా పేరు మార్చినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన పసంగ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ పసంగ చిత్రంపైనా ఎక్కడలేని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ త్వరలో విడుదల చేయనుంది.


