మరో చిరు లీక్స్.. కాకాలో కీ రోల్ రివీల్..! | Chiranjeevi Comments about anaswara rajan role In Kaaka Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మరో చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ ఇదే..!

Nov 18 2026 1:51 PM | Updated on Nov 18 2026 1:57 PM

Chiranjeevi Comments about anaswara rajan role In Kaaka Movie

మెగాస్టార్ చిరంజీవి కాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్నా ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా మెగాస్టార్ తాజాగా ఇట్లు అర్జున్ మూవీ సక్సెస్‌ మీట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా హీరోయిన్ అనస్వర రాజన్ రోల్‌కు సంబంధించి చిరు చిన్న హింట్ ఇచ్చారు. ఎక్కడ లీక్ చేస్తానేమోనని నాకు భయంగా ఉందన్నారు. అయినా కూడా వేదికపై మాట్లాడుతూనే అనస్వర రాజన్ పాత్రను లీక్ చేశారు. ఈ మూవీలో అనస్వర అద్భుతంగా చేసిందని.. అయితే ఇక్కడ తానేమీ మాట్లాడదన్నారు. ఎందుకంటే అసలు అనస్వరకు మాట్లాడటమే ఇష్టం లేదని అన్నారు. నేను చెప్పిన మాటలు మీరు ఇంటికెళ్లాక బాగా ఆలోచించండని అభిమానులకు చిన్న పరీక్ష పెట్టారు.

m

అయితే మెగాస్టార్ మాటలు వింటే అనస్వర ఈ చిత్రంలో మూగ అమ్మాయిగా కనిపించనుందని తెలుస్తోంది. గతంలో ఆమె రోల్‌పై వార్తలు కూడా వచ్చాయి. మూగ అమ్మాయి పాత్రలో ఆమె నటిస్తారని టాక్ వినిపించింది. తాజాగా చిరు కామెంట్స్ వింటుంటే అదే రోల్లోనే అనస్వర రాజన్ కనిపించనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ కూతురిగా అనస్వర రాజన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement