జపాన్‌లో ‘నాగ్ సామా’.. ‘శివ’కు అదిరిపోయే స్పందన | Overwhelming response for Nagarjuna Akkineni Shiva Movie in Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో ‘శివ’ జోరు.. నాగార్జునకు ‘నాగ్ సామా’ అంటూ ఫ్యాన్స్ ఫిదా!

Oct 6 2026 11:30 PM | Updated on Oct 6 2026 11:43 PM

Overwhelming response for Nagarjuna Akkineni Shiva Movie in Japan

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌గా జపాన్‌లో రీ-రిలీజ్ అయింది. 1989లో విడుదలైన ఈ చిత్రం 37 ఏళ్ల తర్వాత కూడా జపాన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ‘శివ’ గ్లోబల్ ఆడియన్స్‌లోనూ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కింగ్‌ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సన్నివేశాలకు జపాన్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్కడి అభిమానులు నాగార్జునను గౌరవంగా ‘నాగ్ సామా’ అని సంబోధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అధునాతన 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శివ చిత్రం వచ్చింది. తన ప్రభావం కాలంతో పాటు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా అప్పట్లో సౌండ్ డిజైన్, టేకింగ్, యాక్షన్ ప్రెజెంటేషన్ పరంగా టాలీవుడ్ దిశను మార్చిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్‌ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్‌లోనూ కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషమనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement