నమ్మకంగా సేవలు చేస్తుందని నమ్మిన ఒక నర్సు నట్టేట ముంచేసింది. తనపై ఆధారపడిన 99 ఏళ్ల వృద్ధురాల్ని దారుణంగా మెసం చేసింది. ఏకంగా రూ. 9.6 కోట్లు కొట్టేసి జల్సాలు చేసింది. యుకే (UK) లో విలువైన ఆస్తులు ,నగదును దోచుకున్న ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్ (NMC) విచారణ జరిపి సదరు నర్సుపై కఠిన చర్యలు తీసుకుంది. 2002లో నర్సుగా రిజిస్టర్ అయిన రెబెక్కా బర్వుడ్, వేల్స్‌లోని ఫ్లింట్షైర్లో ఉన్న 'బ్రిన్ యర్ హాల్ కేర్ హోమ్' లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం, రెబెక్కా బర్వుడ్ (Rebecca Burwood) అనే నర్స్, ఫ్లింట్‌షైర్‌లోని ఒక కేర్ హోమ్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టింది. 2017లో కిందపడిగాయపడి, ఒంటరిగా మారిన 99 ఏళ్ల వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్టు నటించి సుమారు రూ. 5 కోట్లువిలువైన ఇంటిని తన పేరిట బదిలీ చేయించుకుంది. బర్వుడ్ తన సొంత ఇంటికి అదనపు నిర్మాణం కోసం కూడా డబ్బు పొందింది. ఒకవేళ మరో మహమ్మారి లాక్డౌన్ సంభవిస్తే, ఆ అదనపు స్థలం ఆ వృద్ధురాలిని తనతో పాటు నివసించడానికి అనుమతిస్తుందని ఆమె వాదించింది. అంతేకాకుండా, వృద్ధురాలి పేరిట లాస్టింగ్ పవర్ ఆఫ్ అటార్నీ (LPA) కూడా సాధించింది. ఇలా గత ఐదేళ్లలో సుమారు రూ. 4.6 కోట్లు నగదును కాజేసింది.
అలా కొట్టేసిన సొమ్ముతో తన సొంత ఇంటి మరమ్మత్తులు, కరెంట్ బిల్లులు, కౌన్సిల్ టాక్స్ చెల్లించింది. టూర్స్‌కు వెళ్దామని నమ్మించి ఒక కారు, క్యాంపర్వాన్ కొనుగోలు చేయించింది. అంతేకనా కాస్మోటిక్ సర్జరీలు బ్యూటీ ట్రీట్మెంట్స్ అంటూ తెగ వాడేసింది.
ఇదీ చదవండి: బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
వెలుగులోకి వచ్చిందిలా?
వృద్ధురాలి బ్యాంక్ ఖాతా నుండి పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా కావడంపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఫ్లింట్షైర్ కౌన్సిల్ ఈ విషయాన్ని నర్సింగ్ కౌన్సిల్‌కు నివేదించింది. అలా ఆమె బండారం మొత్తం బయటపడింది. వృద్ధురాలి ఒంటరితనాన్ని, బలహీనతను బర్వుడ్ స్వార్థానికి వాడుకుందని నిర్ధారణ కావడంతో బెక్కా బర్వుడ్ను నర్సింగ్ రిజిస్టర్ నుండి పూర్తిగా తొలగిస్తూ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: యూపీ ఎన్నికలపై అఖిలేష్ జోస్యం, ఈసీపై సంచలన వ్యాఖ్యలు


