తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రేమకథలు, మాఫియా, హారర్, పోలీస్, థ్రిల్లర్, పల్లెటూరి నేపథ్యం, యాక్షన్... ఇలాంటి కథల ట్రెండ్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్స్ టైమ్ నడుస్తోంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రస్తుతం పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్స్ కథలతో సినిమాలు చేస్తున్నారు. హీరో నాని కూడా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించనున్న మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నారు. ఇక ఆ చిత్రాల వివరాలేంటో చూద్దాం...
కాకాలో...
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. వీరికాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 జనవరి 13న ఈ సినిమా విడుదలై, హిట్‌గా నిలిచింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘కాకా’. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వరా రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్్స బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో చిరంజీవి ద్వి పాత్రాభినయంలో కనిపిస్తారని, ఓ పాత్ర తండ్రి కాగా, మరో క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని టాక్. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ మూవీలో మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉంటుందట. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. అయితే కథలో అది ఓ భాగం మాత్రమే. కానీ ‘కాకా’ సినిమాలో మాత్రం చిరంజీవి పూర్తిగా మాఫియా డాన్‌గానే కనిపించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నప్పటికీ కథ చాలా వైవిధ్యంగా ఉంటుందట.
అదే విధంగా మరోవైపు తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కూడా ఉంటుంది. చిరంజీవి కుమార్తె అమ్ములు పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారు. ‘‘బ్లాక్‌బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. చిరంజీవి పుట్టినరోజు(ఆగస్టు 22) సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అనురాగ్ కశ్యప్ చేరిక సినిమాకు మరింత ఆసక్తిని తీసుకొచ్చింది. ప్రస్తుతం ‘కాకా’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు బాబీ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. 2027 జనవరి 13న సంక్రాంతి పండగ సందర్భంగా ‘కాకా’ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్.
కింగ్ 100
హీరో నాగార్జున గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. గతంలో ‘డాన్, భాయ్’ వంటి సినిమాల్లో మాఫియా లీడర్‌గా ఆయన నటించిన సంగతి తెలిసిందే. ‘కింగ్ 100’ సినిమాకి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్నారు.
ఆయన కెరీర్‌లో ఇది వందో సినిమా కావడంతో కథ, ఔట్‌పుట్‌పై ప్రత్యేకమైన దృష్టి సారించారు నాగార్జున. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్‌లో టు షేడ్స్ ఉంటాయట. ఒకటి తండ్రి పాత్ర కాగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ అక్కినేని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘‘మనుషుల్లో రెండు రకాలు. ఒకరు డబ్బున్నోళ్లు, ఇంకొకరు లేనివాళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను అందరూ లూజర్‌లా చూశారు. డబ్బు ఉన్నప్పుడు ‘దే కాల్ మీ ది కింగ్’.
దిస్ ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దెన్ మనీ. ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉండాలి’’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్‌ను బట్టి చూస్తే నాగార్జున పాత్ర పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగే ప్రయాణం చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. డబ్బు లేని సమయంలో ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత డబ్బు సం పాదించి సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం... ఆ గుర్తింపును కా పాడుకోవడానికి అతను చేసే పోరాటం సినిమాకు కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి.
అదే విధంగా నాగార్జున–టబు కాంబినేషన్ ఈ సినిమాకి ఓ ప్రధాన ఆకర్షణ అవుతుంది. గతంలో నాగార్జున, టబు కలిసి ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాల్లో నటించారు. అలాగే ‘సిసింద్రి’ చిత్రంలో ఓ పాటలో సందడి చేశారు. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున– టబు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఇటు అక్కినేని అభిమానుల్లో అటు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమాలో టబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆమె కనిపించనున్నారని సమాచారం. ‘కింగ్ 100’ నాగార్జున కెరీర్‌లో వందో చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
దాదాలో
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘దాదా’. ‘వీర సింహారెడ్డి’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ఇది. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ముంబై బేస్డ్ డాన్ గా కనిపించనున్నారు బాలకృష్ణ.
గతంలో ‘రానా, అశోక చక్రవర్తి, డిక్టేటర్’ వంటి మూవీస్‌లో మాఫియా డాన్‌గా నటించిన ఆయన తాజాగా ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున(జూన్ 10) ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ అనే పేరుతో విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో ΄÷గరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు... బుల్లెట్స్‌కి బలుపు, గన్ ్సకి గట్స్ ఉండాలి’ అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ గ్లింప్స్‌లో ఉన్నాయి.
‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘దాదా’. బాలకృష్ణను మంచి మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి’’ అన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... ‘దాదా’ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. తమన్, కెమెరా: అరవింద్ ఎస్. కశ్యప్.
స్పిరిట్‌లో...
వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ తృప్తీ దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్ ్స, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీస్ అనగానే పవర్‌ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్ర కథ సాగుతుందని అనుకుంటారు. అయితే ఈ సినిమాలో భావోద్వేగాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందట. కానీ క్రమశిక్షణ గల ఓ పోలీస్ అధికారి గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అసలు ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది.
‘‘స్పిరిట్’ చిత్రంలో తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు ప్రభాస్. తన మార్క్ ఇంటెన్ ్స, యాక్షన్, ఎమోషన్స్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్్స ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్ రెడ్డి. ఇది పోలీస్ స్టోరీ కథ అయినప్పటికీ కుటుంబ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు ఉంటాయి’’ అంటూ చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా 8 భాషల్లో 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
డ్రాగన్‌లో...
‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్, సలార్’ మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ‘కాంతారా’ మూవీ ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ లూగర్ అనే ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భాన్ని పురస్కరించుకుని ‘డ్రాగన్’ టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
‘బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఒక మొక్క... దే కేమ్ ఫర్ ఒప్పియమ్ ΄÷ప్పీ, ఉచ్ ప్రోడ్యూస్ ది మోస్ట్ అడిక్టెవ్ సబ్‌స్టాన్స్ ఇన్ ది వరల్డ్, హెరాయిన్. ప్రపంచంలో ఒప్పియమ్‌ను అత్యధికంగా పండించేవి రెండు ప్రాంతాలు... ఆప్ఘనిస్తాన్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్లు దాన్ని అధీనంలో ఉంచుకుని 95 శాతం ఒప్పియమ్ ట్రేడ్‌ను కంట్రోల్ చేసేవాళ్లు. 1947లో బ్రిటిష్ వాళ్లు ఇండియాను వదిలిపెట్టి వెళ్లిపోయినప్పుడు, ప్రపంచంలోనే అత్యధిక లాభదాయకమైన వ్యా పారాన్ని కూడా వదిలి వెళ్లిపోయారు.
దాంతో ఆ వ్యా పారం రెండుగా చీలింది. ఒకటి ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఒప్పియమ్ వార్స్ మొదలయ్యాయి.. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు... అప్పుడు దెయ్యం పుట్టింది’ వంటి డైలాగ్స్‌తో గ్లింప్స్ సాగుతుంది. ‘దేవుడు నాకు ఓ గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం’, ‘నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు... మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి.. ΄÷ర పాటున కూడా నా కల్లోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు ‘డ్రాగన్’ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. అనిల్ కపూర్æ, బిజు మీనన్, అశుతోష్ రాణా, ఖుష్బు సుందర్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్లడీ రోమియోలో...
హీరో నాని ఇటీవల కాలంలో వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్నారు. ‘దసరా, హిట్: ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్’ వంటి సినిమాల్లో ఫుల్ మాస్‌గా కనిపించారాయన. నాని నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లడీ రోమియో’. ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రోడక్షన్స్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు నాని. ఫిబ్రవరి 24న ఆయన బర్త్‌డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో ‘హి ఈజ్ ఏ నంబర్‌వన్ గ్యాంగ్‌స్టర్’ అంటూ నానీని ప్రజెంట్ చేశారు.
స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని పాత్రని పవర్‌ఫుల్‌గా, సరికొత్తగా చూపించనున్నారట సుజీత్. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా, డార్క్ హ్యూమర్ మేళవించిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా తొలుత మీనాక్షి చౌదరి పేరు ప్రముఖంగా వినిపించింది.
కానీ, తాజా సమాచారం ప్రకారం ‘కన్నప్ప’ మూవీ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే హీరోయిన్, ఇతర నటీనటులపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం మేజర్ షూటింగ్‌ని లండన్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రానున్న చిత్రాలు ఇంకొన్ని కూడా ఉన్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


