స్టార్‌ హీరోయిన్‌తో తమన్‌ డ్యాన్స్‌.. జోష్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌.. | Thaman and Anaswara Rajan Dance at Itllu Arjuna Song Launch Event in Visakhapatnam | Sakshi
Sakshi News home page

Thaman Anaswara Rajan Dance: స్టార్‌ హీరోయిన్‌తో తమన్‌ డ్యాన్స్‌.. జోష్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌..

Oct 9 2026 1:37 PM | Updated on Oct 9 2026 2:18 PM

Thaman and Anaswara Rajan Dance at Itllu Arjuna Song Launch Event in Visakhapatnam

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనీష్‌, అనస్వర రాజన్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’.  మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్ర బృందం విశాఖపట్నంలోని గీతం కళాశాలలో మూడో పాట విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు తమన్‌, హీరోయిన్‌ అనస్వర రాజన్‌ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేశారు. వీరిద్దరి సందడి అక్కడున్న వారిని అలరించింది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మూగవాడిగా అనీష్‌..
‘ఇట్లు అర్జున’ సినిమాలో అనీష్‌ మూగవాడైన అర్జున పాత్రలో కనిపించనున్నాడు. అనస్వర రాజన్‌ కీర్తి పాత్రలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి అక్టోబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

 (ఇదీ చదవండి: నానా పటేకర్‌ మృతి.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఎమోషనల్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement