పెళ్లిసందడి, ఛాంపియన్ మూవీస్‌తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. తాజాగా మరో మూవీకి సిద్ధమయ్యారు. రోషన్ హీరోగా భారీ సూపర్ హీరో అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ బ్యానర్‌పై పాన్ ఇండియాస్థాయిలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించనున్నారు.
తాజాగా ఈ భారీ అడ్వెంచరస్ మూవీ పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు శ్రీకాంత్ హాజరై ముహుర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో రేఖా పాండే, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
A SUPERHERO UNIVERSE IS COMING TO LIFE🔥 The world awaits a new superhero - @IamRoshanMeka🦸🏻♂️ ❤️🔥 Ashoka Creations proudly announces its Production No. 3 - a grand PAN-INDIA spectacle set to push visual boundaries 🦸♂️✨ Starring @IamRoshanMeka, #RekhaPandey & #VinayRai. https://t.co/3HamsYRRUy
— Ashoka Creations (@AshokaCOfficial) November 11, 2026


