పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాతోనూ విడాకులు తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరికీ డివోర్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. రష్యాకు చెందిన అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమెతోనూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే అన్నా లెజినోవా గురించి నెట్టింట చర్చ మొదలైంది. తీన్‌మార్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్యన్ భామ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె నెట్ వర్త్ ఎంత అని తెగ చర్చించుకుంటున్నారు. అన్నా లెజినోవా రష్యా నేపథ్యం, మరోవైపు కోట్లాది రూపాయల సామ్రాజ్యం ఉన్న వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ నెట్‌వర్క్ ఉందని సమాచారం.
రూ. 1800 కోట్ల యువరాణి
అన్నా లెజినోవా భారీ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. రష్యాతో పాటు సింగపూర్‌లో ఆమెకు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సింగపూర్‌లో ప్రముఖ హోటల్ చైన్స్, వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నట్లు సమాచారం. సన్నిహిత వర్గాల అంచనా ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.1,800 కోట్లకు పైగానే ఉందని టాక్. ఆమె విద్య, వ్యాపార రంగాల్లో గుర్తింపు సాధించింది. అయితే ఈ ఆస్తుల విలువ, యాజమాన్యానికి సంబంధించి అధికారిక క్లారిటీ అయితే రాలేదు.


