జనసేనకు పీతల మూర్తి యాదవ్ రాజీనామా | Vizag Ex Corporator Murthy resign to Janasena Party | Sakshi
Sakshi News home page

జనసేనకు పీతల మూర్తి యాదవ్ రాజీనామా

Nov 11 2026 1:37 PM | Updated on Nov 11 2026 1:44 PM

 Vizag Ex Corporator Murthy resign to Janasena Party

విశాఖపట్నం: మాజీ కార్పొరేటర్, జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓ లేఖ కూడా పంపించారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించినందుకు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు , స్ఫూర్తిని ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

కోట్లాది రూపాయల విలువైన ఆధ్యాత్మిక ఆస్తుల్ని కాపాడాలని, టీడీఆర్ కుంభకోణంపై పోరాటం చేశానన్నారు. వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ అక్రమాల్ని అడ్డుకున్నానని, పవన్ కల్యాణ్ కోసం తాను జైలుకు వెళ్లానని పేర్కొన్నారు. నిబద్ధత గల జనసైనికుడిగా 6 వేల సభ్యత్వాలు చేయించినట్లు గుర్తు చేశారు. ఇంత చేసినా ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ తనకు ఇవ్వకుండా పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. 

గతంలో కూడా జీవీఎంసీలో తనకంటూ ఏ పదవీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన బీఫామ్‌పై 2021లో గెలిచిన వారందరికీ టికెట్లు ఇచ్చి, తనకు మాత్రం మొండిచేయి చూపించారని పేర్కొన్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 62 ఓట్లతోనే ఓడిపోయినట్లు తెలిపారు దీని వెనుక కొందరి కుట్ర ఉందని గ్రహించానన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌ సీపీకి ఓటు వేస్తారా!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement