విజయం సాధించి.. చరిత్ర సృష్టించి.. | Vendoti Suneetha As the YSRCP Winner From Saidapuram ZPTC | Sakshi
Sakshi News home page

విజయం సాధించి.. చరిత్ర సృష్టించి..

Nov 11 2026 8:46 AM | Updated on Nov 11 2026 8:56 AM

Vendoti Suneetha As the YSRCP Winner From Saidapuram ZPTC

నెల్లూరు జిల్లా: సైదాపురం మండల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున వెందోటి సునీత పోటీ చేసి గెలుపొందారు. ఈమె ఉన్నత విద్యావంతురాలు. ఎంఏ బీఈడీ చేశారు. సైదాపురానికి చెందిన రాజేష్‌తో సునీతకు వివాహమైంది. రాజేష్‌ మొదటి నుంచి సైదాపురం వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ మన్నారపు రవికుమార్‌ యాదవ్‌ అనుచరుడిగా ఉన్నారు. 

జెడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయింది. దీంతో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో సునీత పోటీ చేశారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సైదాపురం జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం అందరి సమష్టి పోరాటానికి నిదర్శనమన్నారు. ఈ విజయాన్ని అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement