గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ విడుదల | APPSC Group 2 Notification 2026 Released | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ విడుదల

Nov 11 2026 6:02 AM | Updated on Nov 11 2026 6:02 AM

APPSC Group 2 Notification 2026 Released

డిసెంబర్‌ 11 వరకు దరఖాస్తులకు అవకాశం

సాక్షి, అమరావతి: గ్రూప్‌–2 సర్వీసుల పరిధిలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీ పబ్లి­క్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్‌ వి­డుదల చేసింది. ఈ పోస్టులపై గతనెలలో షార్ట్‌ నో­టిఫికేషన్‌ ఇచ్చిన కమిషన్‌ పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ ఇచ్చింది. వివిధ విభా­గాలకు సంబంధించి 720 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు మంగళవారం నుంచి డిసెంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.సమగ్ర వివరాలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌   https://psc.ap.gov.in లో చూడవచ్చని పేర్కొంది.

పోస్టులు ఇవే.. 
ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 ఆరు, డిప్యూటీ ఎంపీడీవో 176, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ 10, డిప్యూటీ తహశీల్దార్‌ 203, సబ్‌–రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 ఏడు, గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ ఆఫీసర్‌ 40, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ 29 కలిపి మొత్తం 471 ఉన్నాయి. అలాగే, నాన్‌–ఎగి్జక్యూటివ్‌ పోస్టుల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 80, సీనియర్‌ అకౌంటెంట్‌ 91, జూనియర్‌ అకౌంటెంట్‌ 47, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ 31 కలిపి మొత్తం 249 ఉన్నాయి.

పరీక్ష విధానం.. 
ప్రిలిమినరీ పరీక్ష ఆఫ్‌లైన్‌ పద్ధతిలో (ఓఆర్‌ఎం బేస్డ్‌) 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగాల్లో నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత (నెగిటివ్‌ మార్కింగ్‌) విధిస్తారు. మెయిన్‌ పరీక్షలో మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్‌ పరీక్ష క్లియర్‌ చేసిన అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement