19న మండలాధ్యక్షులు, 20న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు | SEC Issues Notification For ZPTC and MPTC Chairpersons On Nov 19 and 20th: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

19న మండలాధ్యక్షులు, 20న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు

Nov 11 2026 5:16 AM | Updated on Nov 11 2026 5:16 AM

SEC Issues Notification For ZPTC and MPTC Chairpersons On Nov 19 and 20th: Andhra Pradesh

నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠ 

అదే రోజు ఉపాధ్యక్షులు, కో–ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక 

కొత్తగా ఎన్నికైన సభ్యులకు 14 కల్లా నోటీసులు 

ముందుగా నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం 

అనంతరం కోఆపె్టడ్‌ సభ్యుల ఎన్నిక 

ఆ తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీల ఎన్నిక 

సభ్యులు పార్టీ విప్‌ పాటించాలని సూచన 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎలాంటి ఓటు హక్కు ఉండదని స్పష్టికరణ

సాక్షి, అమరావతి: ఈ నెల 19న మండలాధ్యక్షులు, 20న జెడ్పీ చైర్‌పర్సన్‌ల ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీల్లో ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్‌ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జెడ్పీటీసీలు సమావేశమై జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు వైస్‌ చైర్‌పర్సన్, ఇద్దరు కో–ఆప్టెడ్‌ సభ్యులను ఎన్నుకొంటారు.

19న రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో ఎంపీటీసీలు సమావేశమై మండలాధ్యక్షులను, ఉపాధ్యక్షులను, ఒక్కో కో–ఆప్టెడ్‌ సభ్యుడిని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఈ నెల 14 కల్లా ఎన్నికల నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈ ప్రత్యేక సమావేశాల్లోనే మధ్యాహ్నం ఒంటి గంటకు సభ్యులందరితో ప్రమాణం చేయించాలని, ఆ తర్వాత ముందుగా కో–ఆపె్టడ్‌ సభ్యులను ఎన్నుకోవాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరోసారి సమావేశమై జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీల ఎన్నికలు చేపట్టాలని సూచించారు. 

రాజకీయ పా ర్టీలకు విప్‌ జారీ అధికారం 
ఈ ఎన్నికలను చేతులు పైకెత్తి ఓటు వేసే విధానంలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు విప్‌ జారీ చేసే అధికారం ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల సభ్యులు పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాలి. అయితే కో–ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్‌ జారీ నిబంధన లేదని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎలాంటి ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. వీరు ఆయా మండల, జిల్లా పరిషత్‌లలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 19, 20 తేదీల్లో జరిగే ప్రత్యేక సమావేశాలకు హాజరు కావచ్చని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement