20న జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

20న జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

నెల్లూరు(పొగతోట): జెడ్పీ చైర్మన్‌, ఎంపీపీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం విడుదల చేసింది. జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను 20న, మండల పరిషత్‌లకు ఎంపీపీల ఎలక్షన్‌ను 19న జరపనున్నారు. తొలుత కో ఆప్షన్‌ సభ్యులు, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను నిర్వహించనున్నారు. ప్రక్రియకు జెడ్పీ సీఈఓ మధుసూదన్‌ చర్యలు చేపట్టారు.

పల్లె పోరుకు

సిద్ధంగా ఉండాలి

నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని డీపీఓ వెంకటరామన్‌ ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి మండలాధికారులతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అవసరమైన సామాగ్రి, బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశామని వివరించారు. నోటిఫికేషన్‌ను విడుదల చేసిన అనంతరం షెడ్యూల్‌ మేరకు ప్రక్రియను పూర్తి చేయనున్నామని వెల్లడించారు. మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు.

కండలేరులో నీటి నిల్వ

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 16.66 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయిగంగ కాలువకు 70, లోలెవల్‌కు పది, పిన్నేరుకు ఐదు, మొదటి బ్రాంచ్‌ కాలువకు ఏడు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.

శ్రీవారి దర్శనానికి

20 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 83,609 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,816 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.95 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటలు పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement