మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 291 బేళ్లను మంగళవారం విక్రయించామని నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. 363 బేళ్లు రాగా, వీటిలో 291ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 38,586.2 కిలోల పొగాకును విక్రయించగా, రూ.57,69,993.90 వ్యాపారం జరిగిందని వెల్లడించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.90.. సగటు ధర రూ.149.54గా నమోదైందని చెప్పారు. పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.250
కలిగిరి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.338 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 238 బేళ్లను తీసుకురాగా, 557ను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 100 తిరస్కరణకు గురయ్యాయి. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడారు. కనిష్టంగా రూ.90.. సరాసరి రూ.150.11 లభించిందని పేర్కొన్నారు. 12 కంపెనీలు హాజరయ్యాయని చెప్పారు.


